ఆనం వెంకటరమణా రెడ్డి
సిరా న్యూస్,నెల్లూరు;
బస్సు యాత్ర పేరుతో ఐదేళ్లలో మొదటిసారి ప్రజల్లోకి వస్తున్న జగన్ మోహన్ రెడ్డిని స్వాగతిస్తున్నామని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణ రెడ్ది అన్నారు.
ఐదేళ్లుగా ప్రజల కష్టాలు తెలుసుకోలేని జగన్మోహ రెడ్ది ఎన్నికల రావడంతోనే బస్సు యాత్ర పేరుతో బయటకు వస్తున్నాడు.. జగన్ మోహన్ రెడ్డికి త్రెట్ ఉందని సెక్యూరిటీ పెంచుతున్నట్టు డిజిపి మూడు నెలల క్రితం ప్రకటించారు. మోడీ మూడు హెలికాప్టర్లలో వస్తారు కాబట్టి నేనేమి తక్కువ కాదు అని జగన్మోహన్ రెడ్ది రెండు హెలికాప్టర్లు పెట్టుకున్నాడు. త్రెట్ ఉన్న జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను డీజీపీ ఎలా అనుమతిస్తారు. జగన్మోహన్ రెడ్దికి త్రెట్ లేకపోతే గతంలో డిజిపి చెప్పిన మాటలు అబద్దమా ని ప్రశ్నించారు.
హెలికాప్టర్ల పేరుతో ప్రభుత్వ ధనాన్ని జగన్మోహన్ రెడ్ది దుర్వినియోగం చేశాడు. గతంలో బారికేడ్ల, పరదాల మాటున ప్రయాణం చేసిన జగన్మోహన్ రెడ్డి అదే బారికేడ్ల, పరదాల కట్టుకొని బస్సు యాత్ర చేస్తారా. బారికేడ్లు, పరదాలు కట్టకుండా జగన్మోహన్రెడ్డి బస్సు యాత్ర చేస్తే.. ఈ ఐదేళ్లలో ప్రజల మధ్యకు రాకపోయినందుకు క్షమాపణలు చెప్పాలని అన్నారు.
==================xxx