జిల్లా పార్టీ అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి
సిరా న్యూస్,నెల్లూరు;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించి పార్టీ పూర్వవైభవానికి అండగా నిలిచేందుకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమించబడిన వై.ఎస్.షర్మిల నియామకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆస్తుల పరిరక్షణ కమిటీ ఛైర్మన్గా హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నామని నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేవురు.దేవకుమార్ రెడ్డి పేర్కొన్నారు.సామాన్యుడిని ఉన్నత స్థాయిలో గౌరవించడం అలాగే దూరదృష్టితో రాష్త్ర మరియు దేశ ప్రజల భవిష్య్తును దృష్టిలో వుంచుకొని ప్రతీ ఒక్కరు హర్షించదగ్గ నిర్ణయాలను తీసుకొని చారిత్రాత్మక ఆసక్తికర రాజకీయాలను చేయడంలో అఖిలభారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి సరిపోటి కలిగిన రాజకీయ పార్టీలు దేశంలో రాష్ట్రంలో ఖచ్చితంగా లేవని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పదవీ బాధ్యలను చేపట్టిన నాటి నుండి నేటి వరకు కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో బలోపేతం చేసేందుకు ఎనలేని సేవలను అందించినందుకు అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ సి.డబ్లూ.సి స్థాయిలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఎన్నిక చేసినందుకు జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకి, రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలియజేశారు. నూతనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైన వై.ఎస్.షర్మిల కూడా ప్రస్తుత రాజకీయ పార్టీలు ప్రజల్ని చిన్నాభిన్నం చేస్తున్న తీరును రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే రీతిలో బహిర్గంచేసి మహానేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి బిడ్డగా ప్రతీ ఒక్కరినీ కలుపుకొని ముందుకు సాగుతూ కాంగ్రెస్ పార్టీకి విశిష్ఠ కృషి చేయాలని ఈ సందర్భంగా కోరారు.