ఎమ్మెల్యే చింతమనేని
సిరా న్యూస్,ఏలూరు;
ఏలూరు రూరల్, కొల్లేటి గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యను పరిష్కరించేలా చర్యలు చేపడతామని లంక గ్రామాల ప్రజల కు అన్ని విధాల కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు.మీకోసం మీ చింతమనేని కార్యక్రమంలో భాగంగా ఏలూరు రూరల్ మండలం లోని ప్రతి కోళ్ల లంక, పైడిచింతపాడు, కొక్కిరాయ లంక గ్రామాల్లో స్థానిక నాయకులు అధికారులతో కలిసి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పర్యటించారు. ఈ సందర్భంగా తమ గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కూటమి నాయకులు, అభిమానులు, కార్య కర్తలు, పూల జల్లులతో, మంగళ వాయిద్యాలతో, పుష్పగుచ్చాలతో, మహిళల మంగళహారతులతో, భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు.గ్రామంలో నెలకొని ఉన్న రోడ్లు, డ్రైనేజీలు, ఫించన్లు మంజూ రు సహా పలు ప్రజా సమస్యలను గ్రామస్తులు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దృష్టికి తీసుకురాగా సత్వరమే వాటిని పరిషిష్కరించెల చర్యలు చేపట్టాలని అధికారులకు చింతమనేని ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా దెందులూ రు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ కొల్లేటి లోని పలు లంక గ్రామాల ప్రజలు త్రాగునీటి కొరతతో ఇబ్బంది పడుతున్నారని, వారానికి ఒకసారి కూడా త్రాగు నీరు సరఫరా జరగకుండా ఇబ్బంది పడుతున్నారంటే లంక గ్రామాలు పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో తెలుస్తుందని అన్నారు. సత్వరమే త్రాగు నీటి సమస్యను పరిష్కరించటానికి అధికారులు చర్యలు తీసుకోవాలని, పైప్ లైన్ నిర్మాణాలు చేపట్టటానికి అంచనా లు సిద్దం చేసి పనులు సత్వరమే జరిగేలా చూడాలని ఆదేశించారు. గ్రామాల్లో 4దశాబ్దాల పైగా నివాసం ఉంటున్న గ్రామస్తులకు గ్రామ వాటాల విషయంలో అన్యాయం జరగకుండా గ్రామ పెద్దలు చొరవ చూపాలని చింతమనేని సూచించారు. లంక గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు.
=======================