సిరా న్యూస్,ఖమ్మం;
బిజెపి ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావుకు బిజెపి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. టికెట్ కేటాయించిన తరవాత తొలిసారి జిల్లాకు వస్తున్న వినోద్ రావుకు ఘన స్వాగతం లభించింది. ద్విచక్ర వాహనాలతో యువత పెద్ద ఎత్తున చేరుకొని,బిజెపి జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. జై బిజెపి జై నరేంద్ర మోడీ,జై తాండ్ర వినోద్ రావా అంటూ నినాదాలు చేసారు.
తరువాత వినోద్ రావు మాట్లాడుతూ ఈ రోజు నరేంద్ర మోడీ, జేపీనడ్డా, కిషన్ రెడ్డి లు నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఖమ్మం జిల్లా ప్రజలకు నిధులు అందించేందుకు నన్ను సమర్థుడిగా భావించి నాకు అవకాశం ఇచ్చారు. ర్యాలీ కి వచ్చిన ప్రజల ముఖంలో నా మీద, నరేంద్ర మోడీ మీద ఉన్న ప్రేమ కనిపించింది. మొదటి సారి ఖమ్మం జిల్లాలో బీజేపీ జెండా ఎగరడం ఖాయం. పార్టీలకు అతీతంగా ప్రజలు ఖమ్మం జిల్లాలో బీజేపీ కి ఓటు వేసి నన్ను గెలిపిస్తారని అన్నారు.
బిజెపి రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ధర్మారావు మాట్లాడుతూ బీజేపీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 17 సీట్లలో ఎక్కువ సీట్లు గెలుపొందుతుంది. దేశంలో బాంబులు, తుపాకుల శబ్దం తగ్గిపోయింది. మోడీనీ మూడవసారి అధికారంలోకి తీసుకుని రావడానికి యువత ఆలోచిస్తుంది. 500 వందల సంవత్సరాల అయోధ్య సమస్యను పరిష్కరించింది బీజేపీ. అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించింది కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థి కరువయ్యారు. దేశంలోని సగటు పేదవాడు మోడీ మళ్ళీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాడు. బీజేపీ ఖమ్మం అభ్యర్థి వినోద్ రావు ఆయన జాతీయ భావంతో మొదటి సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఖమ్మం జిల్లా ప్రజలు ఆలోచనాపరులు ఈ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేసి తాండ్ర వినోద్ రావును భారీ మెజారిటీతో గెలిపిస్తారని అన్నారు.
===========================================