వరుణ్ తేజ్ కి ఘన స్వాగతం

సిరా న్యూస్,పిఠాపురం;
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారం నిమిత్తం విచ్చేసిన ప్రముఖ సినీ హీరో, మెగా ప్రిన్స్ కొణిదెల వరుణ్ తేజ రికి శనివారం రాజమండ్రి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. చిరంజీవి యువత అభిమాన సంఘాల నాయకులు ధర్మేంద్ర, బాబీ ఏడిద నేతృత్వంలో అభిమానులు గజమాలతో స్వాగతం పలికారు. వరుణ్ తేజ్ గొల్లప్రోలు రూరల్ మండలం తాటిపర్తిలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రచారం మొదలు పెట్టి వన్నెపూడి మీదుగా కొడవలి, చందుర్తి మీదుగా దుర్గాడ చేరుకున్నారు.
==================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *