ఈషా ఫౌండేషన్ లో ఏం జరుగుతోంది…

సిరా న్యూస్;

తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్ ప్రాంతంలో సద్గురు జగ్గీ వాసుదేవ్ కు చెందిన ఈశా ఫౌండేషన్ కార్యాలయంలో పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. ఈ తనిఖీలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్నాయి. గతంలో సద్గురుపై ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత అవి చల్లారిపోయాయి. అయితే ఈసారి ఆరోపణలు రావడం.. వెంటనే పోలీసులు తనిఖీలకు వచ్చేయడంతో సంచలనంగా మారింది. ఇటీవల సద్గురు వాసుదేవ్ పై చెన్నై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ” జగ్గీ వాసుదేవ్ తన కుమార్తెకు వివాహం చేశారు. జీవితంలో బాగా స్థిరపడేలా సంపాదించారు. కానీ ఇతర మహిళల తమ భౌతిక జీవితాన్ని త్యాగం చేయాలని చెబుతున్నారు. ఇలా ఆయన ఎందుకు చేస్తున్నారు” జగ్గీ వాసుదేవ్ ను ఉద్దేశించి తమిళనాడు హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇవి. జగ్గీ వాసుదేవ్ మనదేశంలో గాడ్ మ్యాన్ స్టేటస్ అనుభవిస్తున్నాడు. అలాంటి వ్యక్తిపై హైకోర్టు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఒకరకంగా సంచలనమే అని చెప్పాలి. జగ్గీ వాసుదేవ్ ఇద్దరు మహిళలను నిర్బంధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దానిపై చెన్నై హైకోర్టులో విచారణ జరుగుతుంది. ఈ విచారణ క్రమంలోనే హైకోర్టు వాసుదేవ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.ఈ సమయంలో పోలీసులు ఈశా ఫౌండేషన్ కార్యాలయంలో తనిఖీలు మొదలుపెట్టారు.. వాస్తవానికి వాసుదేవ్ వివాదాలు ఎదుర్కోవడం కొత్త కాదు. ఆయన భార్య మరణించిన తీరు ఇప్పటికీ ఒక వివాదంగానే ఉంది. పర్యావరణం గురించి పదే పదే చెప్పే జగ్గీ వాసుదేవ్.. పర్యావరణ నిబంధనలు పట్టించుకోకుండానే ఈషా ఫౌండేషన్ భవనాలను నిర్మించాడనే విమర్శలు ఉన్నాయి. ఇక ఈషా ఫౌండేషన్ కార్యాలయంలో కొంతమంది మహిళలు అపహరణకు గురయ్యారని స్వయంగా తమిళనాడు పోలీసులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లిన సంఘటనలో చాలా ఉన్నాయి.2022లో జగ్గీ వాసుదేవ్ సేవ్ సాయిల్ అనే నినాదంతో 27 దేశాల్లో 30 వేల కిలోమీటర్ల యాత్ర చేశారు. భారతదేశానికి తిరిగివచ్చారు. ఓ ప్రైవేట్ ఛానల్ ఆయనను ఇంటర్వ్యూ చేసింది. సేవ్ సాయిల్ పేరుతో మీరు చేస్తున్న యాత్ర బాగుందని చెప్పిన ఆ టీవీ ఛానల్.. ఎటువంటి పర్యావరణ అనుమతులు లేకుండానే మీరు ఈషా ఫౌండేషన్ భవనాలు ఎందుకు నిర్మించాలని ప్రశ్నించింది. ఆ ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పకపోగా.. దేశంలో చట్టాలు లేవా అంటూ వ్యాఖ్యానించారు. అనంతరం ఆ టీవీ ఛానల్ విలేఖరి మరో ప్రశ్న వేయగా.. ష్ అంటూ సద్గురు చిరాకును వ్యక్తం చేశారు. ఈషా ఫౌండేషన్ కార్యాలయంలో ఆరుగురు మహిళలు అదృశ్యం అయ్యారట. 2016 తర్వాత ఆ మహిళను కనిపించడం లేదని తమిళనాడు పోలీసులు హైకోర్టుకు విన్నవించారు. గత ఏడాది మార్చిలో తన సోదరుడు 46 సంవత్సరాల గణేషన్ ఈషా ఫౌండేషన్ కార్యాలయం నుంచి కనిపించకుండా వెళ్లాడని తిరుమలై అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో కోర్టు ఆదేశాలతో పోలీసులు విచారణ నిర్వహించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.జగ్గీ వాసుదేవ్ తన యూట్యూబ్ వీడియోల ద్వారా రకరకాల విషయాలను చెబుతుంటారు. ఇటీవల గ్రహణానికి సంబంధించి ఒక విషయాన్ని వెల్లడించారు. చంద్రగ్రహణం సమయంలో ఆహారం కలుషితమవుతుందని ఆయన చెప్పడం సంచలనంగా మారింది. జగ్గీ వాసుదేవ్ భార్యా మరణం విషయంలోనూ అనేక సందేహాలు ఉన్నాయి. వాసుదేవ్ భార్య 997 జనవరి 23న చనిపోయారు. అయితే ఆయన తన భార్య మరణాన్ని మహా సమాధిగా పేర్కొన్నారు. మహా సమాధి అంటే ఒక వ్యక్తి తనకు తానుగా శరీరాన్ని విడిచిపెట్టే విధానం. అయితే మన దేశంలో మహా సమాధి పొందిన వ్యక్తిని ఎవరూ దానం చేయలేదు. ఒకవేళ మహా సమాధి ఒక వ్యక్తి పొందితే.. ఆ వ్యక్తిని సమాధి మాత్రమే చేస్తారు.. గతంలో కల్కి భగవాన్ ఆశ్రమంలోనూ ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. అప్పట్లో ఆశ్రమంలో ఉన్నవారు పోలీసులు తనిఖీలు చేసినప్పుడు ఇలాంటి సమాధానాలు చెప్పారు. చూడబోతే ఈషా ఫౌండేషన్ కార్యాలయంలో జరుగుతున్న వ్యవహారాలు సంచలనంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఫౌండేషన్ కార్యాలయంలో రకరకాల యోగాలు, ఇతర అభ్యసన ప్రక్రియల గురించి మాత్రమే చెబుతున్నారని అక్కడ ఉండే వారు అంటున్నారు. అయితే అక్కడ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు సాగుతున్నాయని కొంతమంది ఆరోపిస్తున్నారు. హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో తమిళనాడు పోలీసులు అక్కడ సోదాలు చేస్తున్నారు. ఒకవేళ పోలీసులు అనుకున్నట్టుగా అక్కడ ఏదైనా దొరికితే.. జగ్గీ వాసుదేవ్ పై కచ్చితంగా చర్యలు ఉంటాయని ప్రచారం జరుగుతున్నది.అయితే సద్గురు తన భార్య కంటే భారతీ అనే మహిళతోనే ఎక్కువసేపు ఉండేవారట. ఈ విషయాన్ని అరుంధతి సుబ్రహ్మణ్యం అనే మహిళ సద్గురు మోర్ దెన్ లైఫ్ అనే పుస్తకంలో రాశారు. ఇక ఈషా ఫౌండేషన్ వెబ్ సైట్ లో అనేక వస్తువులను విక్రయిస్తుంటారు. అయితే అవి అత్యంత ఖరీదుగా ఉంటాయి. జగ్గీ వాసుదేవ్ పాదాల ఫోటో ఫ్రేమ్ 3200 అంటే.. ఆ వెబ్సైట్ ఆధారంగా ఏం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఒక రుద్రాక్ష ఖరీదు 10,000 దాకా ఉంటుంది. జగ్గీ వాసుదేవ్ తన కుమార్తెకు వివాహం చేశారు. కానీ చాలామంది యువతలను సన్యాసం తీసుకోవాలని ప్రోత్సహించారు.. ఇదే విషయాన్ని మద్రాస్ హైకోర్టు ప్రముఖంగా ప్రస్తావించింది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *