ఆరోపణలు ఎదుర్కొంటున్న సబ్ రిజిస్టర్లపై విచారణ ఏది ?

జిల్లాలో రిజిస్టర్ ఉన్నట్టా లేనట్టా ?
సిరా న్యూస్,వరంగల్;
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సబ్ రిజిస్టర్ కార్యాలయాలు అవినీతి కంపుతో కూరుకుపోయన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో జిల్లాలోని పలు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో పనిచేస్తున్న సబ్ రిజిస్టర్ ల అవినీతి పనులపై ప్రజల్లో ఎక్కువగా చర్చ సాగుతుంది. సబ్ రిజిస్టర్ల విచ్చలవిడి పనుల వల్ల రిజిస్టర్ కార్యాలయాలు ప్రజల విశ్వసనీయతను కోల్పోతున్నాయని బాహాటంగా విమర్శిస్తున్నారు. ప్రభుత్వ నియమ నిబంధనలు పాతరేసి ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా సబ్ రిజిస్టర్లు వ్యవరిస్తుండడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. వారి పనుల వలన అక్కడ పనిచేస్తున్న అధికారులను ప్రజలు నమ్మలేకపోతున్నారు. ఎంతసేపు కార్యాలయానికి వచ్చిన ప్రజలను ముక్కుపిండి డబ్బులు కాజేయడమే కానీ వారికి నిస్వార్ధంగా సేవ చేద్దాం అన్నా ఆలోచన లేదన్న అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. వేలల్లో జీతాలు తీసుకుంటూ ప్రజల నుండి మామూళ్లు దండుకోవడం ఏమిటని ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్నారు. సబ్ రిజిస్టర్ ల నిర్వాకంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడటమే కాకుండా కార్యాలయాల ప్రతిష్ట దిగజారి పోతుందని స్థానిక ప్రజలు అనుకుంటున్నారు.సబ్ రిజిస్టార్ల అవినీతి పనులను జిల్లా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరకాల, జనగామ, వరంగల్, హనుమకొండ, భీమ్దేవరపల్లి సబ్ రిజిస్టర్ల వ్యవహారం జిల్లాలో ఇటీవల చర్చనీయాంశంగా మారింది. అదే కాకుండా పరకాల లోని జూనియర్ అసిస్టెంట్గా విధులను నిర్వహిస్తూ, డాక్యుమెంట్ రైటర్ గా మారి ప్రజల వద్ద నుండి వేలల్లో డబ్బులు గుంచి డాక్యుమెంట్లు తయారు చేయడం పరకాల ప్రజలను విస్మయానికి గురిచేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సబ్ రిజిస్టర్ లపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వ్యక్తమవుతున్న జిల్లా రిజిస్టర్ స్పందించకపోవడం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.ప్రతి మూడు నెలలకు ఓసారి లేదా కొద్ది మాసాలకు ఒకసారి జిల్లాలోని సబ్ రిజిస్టర్ కార్యాలయాలను తనిఖీ చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం మూలంగా సబ్ రి స్టార్లు ఆడింది ఆట పాడింది పాట అన్న చందంగా తయారై అవినీతి కంపును వెదజల్లుతున్నాయి అన్న విమర్శలు జిల్లా వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. జిల్లాలో అవినీతి పనులకు పాల్పడుతున్న పలుకుబడి కలిగిన సబ్ రిజిస్టర్ లను వదిలివేసి సామాన్యులను విచారణ చేసి సస్పెండ్ చేసిన సంఘటనలు వరంగల్ జిల్లాలో తీవ్ర చర్చని అంశంగా మారాయి. జిల్లాలోని పెద్దగా ఆదాయాన్ని అందించే సబ్ రిజిస్టర్ కార్యాలయాలను పనిచేస్తున్న పెద్ద పెద్ద తిమింగలాలను వదిలి సామాన్యులపై జిల్లా రిజిస్టర్ చర్యలకు దిగుతున్నారని జిల్లా ప్రజలు విమర్శిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *