ప్రేమించి… పెళ్లిచేసుకొని.. చంపేసి
సిరా న్యూస్,హైదరాబాద్;
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను హత్య చేసి చెత్త డబ్బాలో కుక్కి అటవీ ప్రాంతంలో పడేశాడు భర్త. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో చోటు చేసుకుంది. అయితే హత్యకు గురైన వివాహిత హైదరాబాద్‌కు చెందిన మహిళగా గుర్తించారు అక్కడి పోలీసులు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు విక్టోరియా పోలీసులు. హైదరాబాద్‌కు చెందిన వివాహిత ఆస్ట్రేలియాలో దారుణ హత్యకు గురైంది ప్రేమించి పెళ్లాడిన భర్త ఆమెను హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని చెత్త డబ్బాలో కుక్కి అటవీ ప్రాంతంలో పడేశాడు. తన ఇద్దరి కుమారులను తీసుకొని తిరిగి హైదరాబాదుకు వచ్చాడు. కాప్రా బృందావన్ కాలనీకి చెందిన రిటైర్డ్ ఉద్యోగి బాలిశెట్టి గౌడ్ పెద్ద కుమార్తె శ్వేత ఎం ఫార్మసీ కోసం 2009లో ఆస్ట్రేలియాకు వెళ్ళింది. శ్వేతకు అప్పటికే అశోక్ నగర్‌కు చెందిన అశోక్ రాజుతో పరిచయం అయింది. అశోక రాజు ఆస్ట్రేలియాలో సాఫ్ట్వేర్ గా పని చేస్తున్నాడు. 2012లో హైదరాబాదులో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు.ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో పాయింట్ కుక్‌లో స్థిరపడ్డారు. అయితే ఇద్దరి మధ్య కొంతకాలంగా మనస్పర్ధలు వస్తూ ఉన్నాయి. ఈనెల 5న చివరిగా తల్లిదండ్రులతో ఫోన్ మాట్లాడిన శ్వేత తరచూ గొడవలు జరుగుతున్నాయని భర్తపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య ఈనెల 5న గొడవ జరగ్గా అశోక్ రాజు, శ్వేత గొంతు నిలిమి హత్య చేశాడు. అనంతరం చెత్త డబ్బాలో కుక్కి కారులో 82 కిలోమీటర్ల దూరంలో బక్రీద్ ప్రాంతంలో పడవేశాడు. అనంతరం హైదరాబాద్‌కు వచ్చిన భర్త కుమారుడ్ని భార్య తల్లిదండ్రులకు అప్పగించి విషయాన్ని తెలియజేశాడు. విషయం తెలుసుకున్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి.. బాలిశెట్టి కుటుంబాన్ని పరామర్శించి మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని విదేశాంగ శాఖ మంత్రికి కిషన్ రెడ్డి లేఖ రాసినట్లు తెలిపారు. అశోక రాజును అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న విక్టోరియా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో తెలంగాణకు చెందిన వివాహిత దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్ కు చెందిన మాదగాని బాల్శెట్టిగౌడ్ కుమార్తె చైతన్య (శ్వేత).. తన భర్త అశోక్ రాజ్ తో కలిసి విక్టోరియా రాష్ట్రంలోని పాయింట్ కుక్ సమీపంలో గల మిర్కావేలో నివాసం ఉంటున్నారు. వీరికి మూడేళ్ల బాబు ఉన్నాడు. కొద్ది రోజుల క్రితమే చైతన్య భర్త అశోక్ రాజ్ తో కలిసి విదేశాలకు వెళ్లారు. వారి ఇంటికి 86 కి.మీ దూరంలోని చెత్తబుట్టలో శనివారం ఆమె మృతదేహం లభ్యమైంది. విక్టోరియాలోని బక్లీలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో మృతదేహాన్ని పోలీసులు పరిశీలించారు. భర్తే ఆమెను హతమార్చినట్లు గుర్తించారు. భార్యను చంపిన అనంతరం కుమారుడిని తీసుకుని అశోక్ రాజ్ హైదరాబాద్ వచ్చాడు. అత్తగారింట్లో కొడుకుని వదిలిపెట్టి తిరిగి ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన విక్టోరియా పోలీసులు భర్తే నిందితుడని తేల్చారు. ప్రస్తుతం అతన్ని అరెస్ట్ చేసినట్లు సమాచారం. మరోవైపు, ఏపీకి చెందిన ఓ వైద్యురాలు ఆస్ట్రేలియాలో ప్రమాదవశాత్తు మృతి చెందారు. కృష్ణా జిల్లా ఉంగుటూరుకు చెందిన యువ వైద్యురాలు వేమూరు ఉజ్వల (23) ఆస్ట్రేలియా గోల్డ్ కోస్ట్ లోని బాండ్ విశ్వ విద్యాలయంలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆమె రాయల్ బ్రిస్బేన్ ఉమెన్స్ ఆస్పత్రిలో పని చేస్తున్నారు. ఈ నెల 2న స్నేహితులతో కలిసి సరదాగా ట్రెక్కింగ్ వెళ్లిన ఆమె ప్రమాదవశాత్తు కాలు జారి లోయలో పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని స్నేహితులు తల్లిదండ్రులకు చేరవేశారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయారు. ఉజ్వల తనకు ఇష్టమైన విభాగంలో పీజీ చేసి ఉన్నత స్థానానికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారని.. ఇంతలోనే ఇలా మృత్యువు కబళించిందని ఆవేదన వ్యక్తం చేశారు. గన్నవరంలోని స్వగ్రామానికి వైద్యురాలు ఉజ్వల మృతదేహం శనివారం చేరుకుంది. ఈ క్రమంలో ఆమె పార్థివ దేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు భోరున విలపించారు. ఉంగుటూరు మండలం ఎలుకపాడులో అంత్యక్రియలు నిర్వహించారు.