ఎందుకు వినేశ్ పై వేటు…

సిరా న్యూస్;

100 గ్రాముల బరువు ఎక్కువగా ఉందని వినేశ్ ఫోగట్‌పై అనర్హత వేటు వేసిన వార్త దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇవేం రూల్స్‌ అని అంతా పెదవి విరుస్తున్నారు. ఈ నిబంధనల విషయంలో వాళ్లు చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నారు రెజ్లింగ్ ఫెడరేషన్ కూడా ఇప్పటికే వెల్లడించింది. అయితే…అంతకు ముందు రోజు రాత్రి వినేశ్ ఫోగట్ బరువు తగ్గేందుకు చాలా శ్రమించింది. కానీ అనర్హత వేటు నుంచి తప్పించుకోలేకపోయింది. అసలు ఒలింపిక్స్‌లో ఈ బరువుకి ఎందుకంత ప్రియార్టీ ఇస్తారు..? వినేశ్ ఫోగట్‌ బరువు తగ్గించుకోడానికి ఎందుకంత కష్టపడింది..? అనే చర్చ కూడా జరుగుతోంది. సాధారణంగా ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులకు తమ ఆటను బట్టి వెయిట్ కేటగిరీలు ఉంటాయి. రెజ్లర్లు, బాక్సర్‌లతో పాటు అందరికీ ఇవి వర్తిస్తాయి. రూల్స్ ప్రకారం వాళ్లు చెప్పినంత బరువు మాత్రమే ఉండాలి. కాస్త ఎక్కువున్నా సరే వెంటనే పోటీ నుంచి తప్పించేస్తారు. అందుకే చాలా మంది క్రీడాకారులు ఇలాంటి పోటీల్లో పాల్గొనే ముందు బరువు తగ్గేందుకు తీవ్రంగా శ్రమిస్తుంటారు. కిలోల కొద్దీ బరువు తగ్గిన వాళ్లూ ఉన్నారు. ఇక రెజ్లింగ్ విషయంలో ఈ రూల్స్ మరింత కఠినంగా ఉంటాయి. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ప్రకారం రెజ్లింగ్ పోటీ జరిగే ఉదయమే అందరి బరువునీ చెక్ చేస్తారు. అయితే..అంతకు ముందే రెజ్లర్లకు వైద్య పరీక్షలు చేస్తారు. ఆ తరవాత ఒక్కొక్కరి బరువు పరిశీలిస్తారు. మొదటి రోజున దాదాపు అరగంట పాటు వెయిట్‌ చెక్ చేస్తారు. ఈ అరగంటలో రెజ్లర్లు ఎన్ని సార్లైనా తమ బరువు చెక్ చేసుకోవచ్చు. రెండో రోజున మరో 15 నిముషాల పాటు weigh-in ప్రక్రియ జరుగుతుంది. ఈ సమయంలోనే వాళ్ల ప్రమాణాలకు తగ్గట్టుగా లేకపోతే పోటీ నుంచి తప్పిస్తారు. వినేశ్ ఫోగట్ విషయంలో ఇదే జరిగింది. అయితే…సాధారణంగా ఆమె బరువు 55-56 కిలోల వరకూ ఉండేది. ఎప్పుడైతే 50 kg కేటగిరీలో పోటీ చేయాలని నిర్ణయించుకుందో అప్పుడే బరువు తగ్గాల్సి వచ్చింది. అంటే దాదాపు 5-6 కిలోల వరకూ తగ్గిపోవాలి. అందుకే ఆ స్థాయిలో శ్రమించింది. కానీ…డీహైడ్రేషన్‌కి గురైంది. రూల్స్ ప్రకారం పోటీ చేస్తున్న అన్ని రోజుల్లోనూ అథ్లెట్‌ అదే బరువుని మెయింటేన్ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా రెజ్లింగ్ పోటీలు రెండు రోజులు జరుగుతాయి. ఈ రెండు రోజుల్లోనూ వినేశ్ ఫోగట్ బరువు 50 కిలోలుగానే ఉండాలి. కానీ రెండో రోజు 100 గ్రాములు ఎక్కువగా ఉండడం వల్ల ఆమెపై అనర్హతా వేటు వేశారు. బరువు విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నారు, సమయం అడిగినా ఇవ్వలేదు – వినేశ్ ఫోగట్‌ అనర్హతా వేటుపై రెజ్లింగ్‌లో మొదటి రోజు ఫస్ట్ రౌండ్ నుంచి సెమీ ఫైనల్స్ వరకూ జరుగుతాయి. ఆ తరవాత రెండో రోజు ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారు. రిస్ ఒలింపిక్స్ 2024లో భారత్‌కు పెద్ద షాక్ తగిలింది. మహిళల 50 కేజీల విభాగంలో ఫైనల్స్ కు చేరిన వినేష్ ఫొగట్‌పై అనర్హత వేటు పడింది. ఇంకాసేపట్లో ఫైనల్స్‌లో అమెరికాకు చెందిన రెజ్లర్ సారా హిండెబ్రాండ్‌ తో ఢీ కొట్టాల్సిన సమయంలో ఆమె డిస్ క్వాలిఫై అయ్యారు. ఫైనల్స్‌ ఆడటానికి కాసేపటికి ముందు షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. వినేష్ ఫొగట్‌ డిస్‌‌క్వాలిఫై అయ్యారని భారత ఒలింపిక్స్ కమిటీ అధికారికంగా ప్రకటించింది. ఓవర్ వెయిట్ అంటే.. అధిక బరువు కారణంగా వినేష్ ఫొగట్‌పై అనర్హత వేటు పడింది. నిర్దేశిత బరువు కంటే ఆమె 100 గ్రాములు అధికంగా ఉండటం అనర్హత వేటుకు కారణమైంది. మహిళల రెజ్లింగ్ 50 కేజీల విభాగంలో వినేష్ పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఈ కేటగిరిలో పోటీపడే రెజ్లర్ 50 కేజీలు, లేదా అంతకంటే తక్కువ బరువును కలిగి ఉండాలి. నిబంధనల మేరకు ఓ 100 గ్రాముల మేరకు అధిక బరువును కలిగి ఉండొచ్చు. వినేష్ ఫొగట్ మాత్రం 50 కేజీలకు మించి బరువును కలిగి ఉండడంతో.. అదే ఆమె పై అనర్హత వేటుకు కారణమైందని ఒలింపిక్స్ కమిటీ వెల్లడించింది.మంగళవారం రాత్రి ఆమె రెండు కేజీల వరకు బరువు పెరిగినట్లు తెలుస్తోంది. మొత్తంగా 52 కేజీల బరువును కలిగి ఉన్నట్లు చెబుతున్నారు. దీన్ని 50 కేజీల లోపు వరకు తగ్గించుకునేందుకు మంగళవారం రాత్రంతా నిద్రాహారాలు కూడా మానివేశారు. బరువు తగ్గేందుకు తను చాలా ప్రయత్నించిందంట. రాత్రి గంటలపాటు స్టీమింగ్ రూంలో కూర్చుందంట. రన్నింగ్, స్కిప్పింగ్‌తో పాటు సైక్లింగ్ కూడా చేసిందంట. అలాగే, తన జుట్టు, గోళ్లను కూడా కత్తిరించిందంట. అలాగే రక్తాన్ని కూడా తీసిందట. అయినప్పటికీ ఆమె బరువు 50 కిలోల 100 గ్రాముల కంటే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. దీంతో ఆమెపై అనర్హత వేటు పడింది. కాస్తలో బంగారు పతకం మిస్ అయిన వినేష్ విజయం వెనుక ఆమె డైట్ రహస్యం ఏమిటో తెలుసుకుందాం..వినేష్ ఫోగట్ డైట్ ప్లాన్ చాలా కఠినంగా ఉంటుంది. ఆమె స్వీట్లకు, నెయ్యికి చాలా దూరంగా ఉంటుంది. అధిక ప్రోటీన్, పోషకాలను కలిగి ఉన్న ఆహారాన్ని తీసుకుంటారు. ఈ ఆహారం ఆమెకు తక్షణ శక్తిని అందజేస్తుందివినేష్ రోజు ఎల్లప్పుడూ పోషకమైన భోజనంతో ప్రారంభమవుతుంది. ఆమె అల్పాహారంలో సాధారణంగా గుడ్లు, వోట్స్, పండ్లు ఉంటాయి. మధ్యాహ్న భోజనంలో పప్పులు, కూరగాయలు, రోటీలు తింటుంది. ఆమె సాయంత్రం స్నాక్ కోసం డ్రై ఫ్రూట్స్, ప్రోటీన్ షేక్ తీసుకుంటుంది. ఆమె రాత్రి భోజనంలో సూప్, సలాడ్ వంటి తేలికపాటి ఆహారాన్ని ఇష్టపడుతుంది.వినేష్ ఒక్కసారిగా ఎక్కువ ఆహారం తీసుకోరు. ఆమె తన ఆహారాన్ని కొద్ది కొద్దిగా రోజుకు 4-5 సార్లు తింటుంది. ఇది ఆమె జీవక్రియను వేగవంతం చేస్తుంది. వినేష్‌కి పాలు, పెరుగు అంటే చాలా ఇష్టం. రోజూ ఉదయం, సాయంత్రం కలిపి నాలుగు నుంచి ఐదు లీటర్ల పాలు తాగుతుంది. పాలు, పెరుగు ఆమెకు చాలా ముఖ్యమైనవి ఎందుకంటే ఇది ఆమె శరీరానికి శక్తిని ఇస్తుంది.వినేష్ ఫోగట్ బయటి ఆహారం అస్సలు తినరు. ఎప్పుడో ఒకసారి తప్పని పరిస్థితుల్లో తీసుకున్నా వెంటనే అనారోగ్యం పాలవుతుంది. ఒకసారి ఆమె పిజ్జా తిన్నారు. దాని కారణంగా ఆమె ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. అందువల్లే ఆమె ఎప్పుడూ ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని తింటుంది. అదే ఆహారం తనతో పాటు తీసుకువెళుతుంది.గోల్డ్ మెడల్ వచ్చేది రానిది తేలేది రెండో రోజే. అందుకే బరువు విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే…ఇక్కడ కీలక విషయం ఏంటంటే…2017కి ముందు వరకూ అథ్లెట్‌ బరువుని ఒకటే రోజు లెక్కించే వాళ్లు. కానీ…ఒక్క రోజులో బరువు తగ్గడం కష్టం కాబట్టి ఈ వెయిన్ ఇన్ ప్రాసెస్‌ని రెండు రోజులకు పొడిగించారు. దీనిపైనా విమర్శలు వస్తున్నాయి. రెండు రోజుల్లో ఓ మనిషి అంత బరువు ఎలా తగ్గుతాడని ప్రశ్నిస్తున్నారు. నీళ్లు ఎక్కువగా తీసుకోకుండా, కార్బొహైడ్రేట్స్ ఇవ్వకుండా ఆ స్థాయిలో శరీరాన్ని కష్టపెడితే సమస్యలు వస్తాయని వాదిస్తున్నారు. ఇప్పుడు వినేశ్ ఫోగట్ కూడా అంతే కఠినంగా వ్యాయామం చేసి చివరకు ఆసుపత్రి పాలైంది. అందుకే ఈ నిబంధనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
========================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *