సిరా న్యూస్,కరీంనగర్;
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో కేంద్రంలో భర్త ఇంటి ముందు ఓ భార్య బైఠాయించి న్యాయం చేయాలని నిరసనకు దిగింది. వివరాల్లోకి వెళితే తిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామానికి చెందిన శిరీష కు,శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామానికి చెందిన బొంగొని ప్రవీణ్ కుమార్ తో 2017 మే 19న వివాహం జరిగిందని తెలిపారు. మా దంపతులకు ఆగస్టు 17 2018 న తనుశ్రీ అనే పాప జన్మించిందని పాప జన్మించినప్పటి నుండి తనను పట్టించుకోవడంలేదని అదనపు కట్నం తేవాలని ఇబ్బందులకు గురి చేస్తూ వేరే మహిళతో సహజీవనం చేస్తూ తనను నిర్లక్ష్యం చేస్తూ కాపురానికి తీసుకుపోవడం లేదని ఆవేదన వెలుబుచ్చింది. సంఘటన స్థలానికి చేరుకున్న కేశవపట్నం పోలీసులు శిరీషను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాల్సిందిగా పేర్కొని తీసుకువెళ్లారు.