సిరా న్యూస్;
సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మాములుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసుల్లో బెయిల్ దొరకడం అనేది అసాధ్యం.. కానీ కేజ్రీవాల్ కేసును స్పెషల్‌గా తీసుకొని మరీ బెయిల్ ఇచ్చింది అత్యున్నత న్యాయస్థానం.. జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. దీంతో తీహార్ నుంచి రిలీజ్ అయ్యారు కేజ్రీవాల్.. జైలుకు వెళ్లడానికి ముందే బీజేపీపై కత్తులు నూరారు కేజ్రీవాల్.. తనపై తప్పుడు కేసు నమోదు చేసి జైలుకు పంపారన్న కోపం పీక్స్‌లో ఉంది ఆయనకు.. అలాంటి కేజ్రీవాల్‌కు మళ్లీ బయటికి వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొనే చాన్స్ వచ్చింది. దీంతో ఇప్పుడు దేశ రాజకీయాల్లో మరింత స్పైస్ యాడ్ కానుంది. ఇక ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాంలో అరెస్ట్ అయ్యి, మధ్యంతర బెయిల్‌పై తీహార్ జైలు నుంచి విడుదలైన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. తాజాగా ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అమలు చేసే 10 గ్యారంటీలను ప్రకటించారు కేజ్రీవాల్.ఆదివారం ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆప్ జాతీయ కన్వీనర్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 24 గంటల విద్యుత్, ఉచిత విద్య , ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదాతో సహా పలు హామీలను ఇచ్చారు. భారత సరిహద్దు వెంబడి చైనా ఆక్రమించుకున్న భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటామని హామీ ఇచ్చారు.తాను జైలులో ఉన్నందున ఈ పది హామీల ప్రకటన ఆలస్యమైందని కేజ్రీవాల్ అన్నారు. దేశంలో ఇంకా ఎన్నికలు మిగిలి ఉన్నాయన్నారు. ఈ హామీలపై తాను ఇతర ఇండియా కూటమి భాగస్వాములతో చర్చించలేదని.., అయితే ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదని కేజ్రీవాల్ అన్నారు.ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీలు అమలయ్యేలా చూస్తానని హామీ ఇస్తున్నానని కేజ్రీవాల్ అన్నారు.ముందుగా రాబోయే ఎన్నికల్లో కేజ్రీవాల్ ఎఫెక్ట్ ఏ మేరకు ఉంటుందో చూద్దాం.. మాములుగా కేజ్రీవాల్ ఎఫెక్ట్ ఉన్న రాష్ట్రాల లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఉండేది ఢిల్లీ.. ఆ తర్వా పంజాబ్, హర్యాణా… ఇక రాజస్థాన్, గోవాలో ఉన్నా.. అది చాలా తక్కువ.. సో మూడు రాష్ట్రాల్లో కేజ్రీవాల్ ఎఫెక్ట్ ఎక్కువే అని చెప్పాలి. ఇప్పటికే ఈ మూడు రాష్ట్రాల్లో ఆప్ జోరుగా ప్రచారం చేస్తుంది. ఇప్పుడా జోరు మరింత పెరగనుంది. ఢిల్లీలో కాంగ్రెస్‌తో ఆమ్ ఆద్మీ పార్టీ పొత్తు పెట్టుకుంది. ఇండియా కూటమిలో భాగంగా దేశ రాజధానిలోని ఏడు సీట్లలో ఆప్ నాలుగు.. మిగిలిన మూడు సీట్లలో కాంగ్రెస్ నుంచి అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన రాజధానిపై ఫుల్ ఫోకస్ పెట్టనున్నారునెక్ట్స్ పంజాబ్.. ఇక్కడ 13 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. ఇక హర్యాణాలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. బట్ ఇప్పుడు కేజ్రీవాల్ ఎంట్రీతో ప్రచార స్టైల్ మారనుంది. అసలు కేజ్రీవాల్‌కు బెయిల్ వచ్చిన టైమింగ్ హైలేట్ అని చెప్పాలి. ఎందుకంటే ఆప్‌కు చివరి మూడు దశల పోలింగ్ చాలా ముఖ్యం.. మే 20, 25, జూన్ 1 వీటి పోలింగ్ ఉంది. ఢిల్లీ, హర్యానాల్లో ఆరో దశలో మే 25న.. ఆ తర్వాత పంజాబ్‌లో జూన్ 1న పోలింగ్ జరగనుంది. జూన్ 2న ఆయన తిరిగి తీహార్‌కు వెళ్లనున్నారు. సో పర్ఫెక్ట్ టైమ్‌లో బెయిల్ వచ్చింది కేజ్రీవాల్‌కు..కేజ్రివాల్ ఇక స్టేజ్ ఎక్కినా.. రోడ్ షో నిర్వహించినా.. దాని ఇంపాక్ట్ అంతా ఇంతా ఉండదు. ఇకపై అటు మోడీని ఇటు బీజేపీని చీల్చి చెండాడటం ఖాయం. ఇప్పటికే ఆయన ఈ పనిని మొదలు పెట్టారు. మరి ఈ పరిణామాలను ఎదుర్కోనేందుకు బీజేపీ ప్రిపేర్డ్‌గా లేదా? అంటే ఉందనే చెప్పాలి.. ఎందుకంటే.. జైలు నుంచి కేజ్రివాల్ బయటకు వస్తే ఆయనే సెంటరాఫ్ అట్రాక్షన్ అవుతారని బీజేపీకి కూడా తెలుసు. ఇప్పుడు బీజేపీకి ఒక్కటే చాయిస్ ఉంది. అది కేజ్రీవాల్ ఎదుర్కొంటున్న అవినీతి ఆరోపణలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం.. ఎట్ ది సేమ్ టైమ్.. ఆయన జైలు నుంచి వచ్చాడు.. మళ్లీ జూన్ 2న లొంగిపోవాలని సుప్రీం ఇచ్చిన ఆదేశాలను గుర్తు చేయడం.. బీజేపీ ఇదే టాపిక్‌పై ప్రచారం చేయనుంది.బట్ బీజేపీ ఈ స్ట్రాటజీని కేజ్రీవాల్ ఈజీగా ఓవర్‌కమ్ చేస్తారనిపిస్తోంది. ఎందుకంటే ఆయన ఓ మంచి వక్తి.. ఆయన ప్రచార స్టైల్ విద్య, ఉద్యోగం అన్నట్టుగా ఉంటుంది. నేను సామాన్యుడిని.. సామాన్యుల కోసమే పని చేస్తా అన్నట్టుగా సాగుతుంది ఆయన ప్రచారం. రియాల్టీ ఎలా ఉన్నా.. ఈ మధ్య ఎన్నికల ప్రచారంలో ఇదే ట్రేండ్.. దీనికి ప్రజలు ఈజీగా కనెక్ట్ అయ్యే చాన్స్ ఉంది. అంతేకాదు.. ఈ ఎన్నికలను కేజ్రీవాల్ ఓ రెఫరెండంగా భావించే చాన్స్ ఉంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొని తీహార్ జైల్లో ఉన్నా కూడా.. ప్రజలు తనను ఓ వారియర్‌గా భావిస్తారన్న ఆశలో ఉన్నారు కేజ్రీవాల్.. అయితే దీనికి ఆన్సర్ అంత వెంటనే చెప్పలేము.. జూన్ 4 వరకు ఆగాల్సిందే..
05ఓటు హక్కు వినియోగించుకున్న బన్నీ
హైదరాబాద్
సిని నటుడు అల్లు ఆర్జున్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. నంద్యాల టూర్ పై క్లారిటీ ఇచ్చారు. నాకు ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. మా మావయ్య పవన్ కళ్యాణ్ కు నా మద్దతు ఎపుడూ ఉంటుంది. శిల్పా రవి నాకు 15 ఏళ్లుగా మిత్రుడు. అతనికి మద్దతు ఇస్తాను అని గతంలో మాట ఇచ్చాను. రాజకీయాలతో సంబంధం లేకుండా స్నేహితుడిగా మాత్రమే శిల్పా రవికి మద్దతుగా నంద్యాల వెళ్లాను. నాకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం అస్సలు లేదు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించు కోవాలని కోరుకుంటున్నానని అన్నారు.