సిరా న్యూస్,చింతూరు;
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీ లో గాలి వాన బీభత్సం సృష్టించింది. నిన్న సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన గాలివాన దుమారం రేపింది. కూనవరం,వి.ఆర్.పురం, యటపాక మండలాల్లో భారీ చెట్లు నేలకొరిగాయి. కూనవరం మండలం పైడిగూడెం గ్రామంలో ఇంటి పైకప్పు రేకులు గాలిదాటికి కిందపడి ధ్వంసం ఐయ్యాయి. భారీ చెట్లు గాలి వానకి నివాసాలు, స్కూల్ బిల్డింగ్స్, ప్రధాన రహదారులపై పడటంతో గృహోపకరణాలు పడయ్యాయి. మరో వైపు నిన్న సాయంత్రం నుండి కరెంట్ లేకపోవడతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. మరో వైపు విద్యుత్ శాఖ అధికారులు కరెంట్ పోల్ లపై పడిన చెట్లను తొలగిస్తూ నాన అవస్థలు పడుతున్నారు. ఏదేమైనా నిన్నటి గాలి వాన బీభత్సానికి ప్రజలు ఇబ్బంది పడ్డారని చెప్పుకోవచ్చు.
======================