Wines: కిక్కు కోసం క్యూలో

సిరా న్యూస్, భీమదేవరపల్లి
కిక్కు కోసం క్యూలో…
* భీమదేవరపల్లిలోని వైన్స్ ల ప‌రిస్థితి…
తాగు నీటి కోసం.. ఎరువులు.. విత్త‌నాలు కోసం.. ఆధార్ సెంట‌ర్  వ‌ద్ద ప్ర‌జ‌లు క్యూలో నిల‌బ‌డ‌డం చూశాం. కానీ మద్యం కోసం గంటల కొద్ది క్యూ లో నిలబడాల్సిన ప‌రిస్థ‌తి చూస్తున్నాం. ఇది ఏక్క‌డో కాదు… భీమదేవరపల్లి మండలంలో అన్ని వైన్స్ ల వ‌ద్ద చోటు చేసుకుంది. మండలంలోని ముల్కనూర్, కొత్తకొండ, గ్రామాలలో సమ్మక్క- సారలమ్మ వన దేవతలు కొలువుదిరారు. వన దేవతల దర్శనం కోసం భక్తుల సంఖ్య పెరిగింది. మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు మద్యం కోసం ఎగబడటంతో వైన్స్ ల ముందు క్యూ లైన్ పెరిగి పోయింది.. దీంతో మద్యం కావాలంటే గంటలు తరబడి క్యూ లైన్ కట్టి తీరాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *