కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు

 సిరా న్యూస్,సిద్దిపేట;
సిద్దిపేట జిల్లా కేంద్రం లోని జిల్లా పార్టీ కార్యాలయం లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుపార్టీ జెండా ఆవిష్కరణ చేసారు
ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతు 2001 ఏప్రిల్ హైదరాబాద్ జలా దృశ్యం తో ప్రారంభమైన గులాబీ జెండా ప్రస్తానం. నేడు దేశానికి ఆదర్శం అయింది. కొనాయి పల్లి వెంకట్టేశ్వర ఆలయంలో పూజలు చేసిన మూడింటికి రాజీనామా చేసి ఉదయం ప్రారంభం. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు. మన పథకాలను కేంద్ర ప్రభుత్వం కూడా అమలు చేసింది. రైతు బంధు పథకాన్ని కేంద్రంలో బీజేపీ కాపీ కొట్టి అమలు చేశారు.కేసీఆర్ అభివృద్ధి ఆదర్శం ఉంటే, రేవంత్ రెడ్డి తిట్లలో ఆదర్శంగా ఉన్నారు.మన ఎమ్మెల్యేలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇచ్చిన హామీలు అమలు చేయాలని నేను రాజీనామా చేస్తానన్న. నాడు రాజీనామా చేయకుండా ఉన్న వ్యక్తి కిషన్ రెడ్డి. రాజీనామా కోసం జిరాక్స్ పేపరు ఇచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి, తప్పించుకొని తిరిగిన వ్యక్తి కిషన్ రెడ్డి. ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే నేను రాజీనామా కు సిద్ధంగా ఉన్నాను. సొల్లు కాదు.. సీదా మాట్లాడు.. సూటిగా మాట్లాడు. స్పీకర్ పార్మట్ లో ప్రెస్ అకాడమీ చెర్మెన్ శ్రీనివాస్ రెడ్డి కి పంపించు, నేను 5నిముషాల్లో పంపిస్తాను. నాకు పదవులు ముఖ్యం కాదు రైతులు, ప్రజల ప్రయజనాలు ముఖ్యం. నాడు ఓటు కు నోటు, నేడు దేవుళ్లపైన ఒట్లు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ, గ్యారెంటీ లు అమలు చేస్తావో లేదో చెప్పు రేవంత్. నేను రుణమాఫీ చెయ్యాలని అడుగుతే కాంగ్రెస్ మంత్రులు నన్ను తిడుతున్నారు. మీ తిట్లను ప్రజలు గమనిస్తున్నారు. హామీలు అమలు అయ్యే వరకు నేను పోరాటం చేస్తునే ఉంటా. జిల్లాను తొలగిస్తాని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. సిద్ధిపేట జిల్లాలను ఉడగోట్టాలని చూస్తున్నారు. జిల్లాలు ఉండాలంటే పార్లమెంట్ ఎన్నికలో కాంగ్రెస్ బుద్ధి చెప్పాలి… అన్ని జిల్లాల కేంద్రాల ప్రజలను కోరుతున్నానని అన్నారు.
==========

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *