సిరా న్యూస్,షాద్ నగర్;
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని కేశంపేట్ రోడ్డులో గల ఒక చిన్న అద్దెఇంట్లో మహిళ మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. స్థానిక సీఐ ప్రతాప్ లింగం తెలిపిన వివరాల ప్రకారం.. జి సుగుణ అనే మహిళ కొడుకుతో కలిసి కేశంపేట రోడ్డులో గల ఇంట్లో జీవనం కొనసాగిస్తుంది. ఈ క్రమంలో తాగుడుకు బానిసైనది. కొడుకుతో గొడవ పడి మరీ డబ్బులు తీసుకుని మద్యం సేవిస్తుండేది. ఈ క్రమంలోనే 20రూపాయల కోసం కొడుకుతో గొడవపడగా అతను చేయి చేసుకోగ ఆమె కింద పడిపోవడం జరిగింది. స్థానికులు గొడవను ఆపేశారు. కూతురు కూడా వచ్చి మందలించి వెళ్లిపోగా ఆమె మరుసటి రోజు కూడా అదే విధంగా తాగి వచ్చి ఇంటిముందు కింద పడిపోగా స్థానికులు ఆమెను ఇంట్లో పడుకోబెట్టారు. ఈరోజు ఉదయం కొడుకు తల్లిని నిద్రలేపడానికి ప్రయత్నించగా తను స్పందించకపోవడంతో స్థానికుల సహకారంతో చూడగా ఆమె అప్పటికే చనిపోవడాన్ని గుర్తించారు. చావుకు గల కారణాలు పోస్టుమార్టం రిపోర్టర్ తర్వాత వెల్లడిస్తామని సీఐ తెలిపారు.