సిరా న్యూస్,కోనసీమ;
మలికిపురం మండలం రామరాజులంక గ్రామంలో తాగునీటి సమస్యపై మహిళలు నిరసన వ్యక్తం చేశారు. నెల రోజుల నుంచి తాగునీరు సక్రమంగా రావడం లేదంటూ గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేశారు. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడంలేదని వాపోయారు. తాగునీటి సమస్యను తక్షణం పరిష్కరించాలని నినాదాలు చేశారు. సమస్యను పరిష్కరించని పక్షంలో ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.