సిరా న్యూస్,సికింద్రాబాద్;
సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. మారేడ్ పల్లి షెనాయి మైదానంలో మోండా కార్పొరేటర్ కొంతం దీపికా ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకలు, క్రీడా పోటీలలో పెద్ద ఎత్తున మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. డీజే పాటలకు స్టెప్పులేసారు. ముఖ్యఅతిథిగా కంటోన్మెంట్ బీజేపీ ఎమ్మెల్యే కాంటెస్టడ్ అభ్యర్థి శ్రీ గణేష్ హాజరై మాట్లాడుతూ మహిళా భివృద్ది తోనే దేశాభివుద్ది సాధ్యమని, మహిళలు అన్నిరంగాలలో రాణించాలని పిలుపు నిచ్చారు. కేవలం మహిళా దినోత్సవం నాడే కాకుండా ప్రతి రోజూ ఇలాంటి వాతావరణమే ఉండాలని మహిళలంతా కలసి మెలసి ఉండాలని సూచించారు. మహిళలతో కలసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. విజేతలకు బహుమతులు అందజేశారు.
===========================