సిరా న్యూస్,పెద్దపల్లి;
పట్టణంలోని స్థానిక ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఇన్స్టిట్యూట్ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో పేస్ ప్రిప్ సహకారంతో లింక్డ్ఇన్ సర్వీసెస్ పై గురువారం ఒక్కరోజు వర్క్ షాప్ నిర్వచారు. ఈ కార్యక్రమాని కి ఆ సంస్థ ప్రతినిధి ఎం రోహిత్ కుమార్ పాల్గొని వర్క్ షాప్ నిర్వహించారు ఈ సందర్భంగా అకాడమీ డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్ , ప్రిన్సిపల్ డాక్టర్ మణి గణేషన్ మాట్లాడుతూ విద్యార్థులకు లింక్డిన్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ యాక్టివేషన్ పై అవగాహన కల్పించి తద్వారా విద్యార్థులు 25 వేలకు పైగా నూతన టెక్నాలజీలను, కోర్సులను నేర్చుకోవడం కోసం దోహదపడుతుందని తద్వారా విద్యార్థులు నూతన సాంకేతికతను పెంపొందించుకోవడం కోసం దోహదపడుతుందని తెలిపారు. ప్రస్తుత తరుణంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ, డాటా అనలటిక్స్, డాటా సైన్స్, పైతాన్, జావా ఇలాంటి మరెన్నో కోర్సులు ఉచితంగా విద్యార్థులు నేర్చుకోవచ్చని తద్వారా విద్యార్థులు సులవుగా ఉద్యోగ అవకాశాలు పొందడానికి వీలుంటుందని రానున్న కాలంలో విద్యార్థులకు మరిన్ని కార్యక్రమాలు రూపొందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అకాడమీ డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్ , ప్రిన్సిపల్ డాక్టర్ మణి గణేషన్, ఏఓ సురేష్, రాజిరెడ్డి, టాస్క్ కోఆర్డినేటర్ డాక్టర్ కౌశల్య, మధు శేఖర్, స్వాతి, కృష్ణయ్యతో పాటు ఇతర విభాగాధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు