సిరా న్యూస్,ఆళ్లగడ్డ;
పట్టణంలోని విశ్వరూప నగర్లో వెలసిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆలయంలో శుక్రవారం స్వామివారి 331 వ ఆరాధన మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ మహిళా అధ్యక్షురాలు దురుగడ్డ అనురాధ, చైర్మన్ దురగడ్డ రవీంద్రచారి ల ఆధ్వర్యంలో వీరబ్రహ్మేంద్రస్వామి వారికి విశేష పూజలను నిర్వహించారు.
శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి 331 ఆరాధన ఉత్సవాల సందర్భంగా శ్రీ కాళికాదేవి గుడి ఆవరణలో వెలసిన శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో శ్రీ స్వామివారి పంచలోహ విగ్రహాలను పులివెందుల నుంచి వచ్చి ఆళ్లగడ్డ లోని మన విశ్వరూప నగర్ నందు నివసించుచున్న కృష్ణమాచారి వారి ధర్మపతి గోవిందమ్మ లు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆశీస్సులు నా కుటుంబానికి ఎల్లవేళలా కలగాలని ఆశీర్వచనం అందజేశారు. స్వామి వారి ఆరాధన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు మహిళలు హాజరయ్యారు.పూజలో పాల్గొన్న భక్తులకు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి అభిషేక తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయ ఆవరణలో విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆలయ చైర్మన్ దురగడ్డ రవీంద్ర చారి పేర్కొన్నారు.
==========================