సిరాన్యూస్, ఆదిలాబాద్
మోసపూరిత హామీలతో అధికారంలోకి .. : మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాదు
మోసపూరిత హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఆదిలాబాద్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాదు అన్నారు.బుధవారం ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.కాంగ్రెస్ నాయకులు జోగు రామన్న ను విమర్శించడం మాని కాంగ్రెస్ ప్రభుత్వం అదిలాబాద్ ప్రజలకు ఏం చేస్తుందో నిరూపించే చూపెట్టాలని, కాంగ్రెస్ నాయకులు అడ్డమైన కేసులలో ఇరికి అదే ప్రెస్టేషన్ లో నోటికి వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.మోసపూరిత హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రైతులను యువతను అభివృద్ధిని పూర్తిగా విస్మరిచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన మోసపూరిత పర్యటన అని, గత ప్రభుత్వంలో కేటీఆర్ తెలంగాణ అభివృద్ధి ఐటీ పారిశ్రామిక రంగాలకు గట్టి పునాది వేసి. 4.4 విలియం సబ్ కరోడ్స్ ముందు 70 వేల కోట్లు ఏ పరిపాటాన్ని ఎద్దేవా చేశారు. ఇప్పటివరకు 40 శాతం రైతులకు రుణమాఫీ కాలేదని గుర్తు చేశారు. రైతుబంధు రాలేదనిఇవ్వలేదన్నారు. చెప్పింది చేయలేని కాంగ్రెస్ నాయకులు స్థానిక నేత జోగు రామన్న పై నోరు పారేసుకోవడం మానుకొని అదిలాబాద్ కు మీరు చేసే కార్యక్రమాలపై ప్రజానీకం తెలియజేయాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సాజి తోద్దీన్ కొమ్ర రాజు,బట్టు సతీష్, నవత శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.