సిరా న్యూస్,హైదరాబాద్;
హైదరాబాద్ లో అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేస్తున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు కేంద్రం వై+ సెక్యూరిటీ కల్పించింది. వీఐపీ సెక్యూరిటీలో భాగంగా 11 మంది ఆమెకు పహారా కాస్తారు. ఆరుగురు సీఆర్పిఎఫ్ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు ఆమె వెంట ఉండగా, ఐదుగురు గార్డులు ఆమె నివాసం వద్ద సెక్యూరిటీగా ఉండనున్నారు. రాజకీయ నాయకులతో పాటు వ్యాపారవేత్తలకూ కేంద్రం వై+ భద్రత కల్పించవచ్చు