సిరా న్యూస్,యాదాద్రి;
తెలంగాణ తిరుపతి గా పేరుగాంచిన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో.. ప్రసాదం కోసం భక్తులు, ప్రజలు వేయికళ్లతో ఎదురు చూస్తుంటారు. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో లడ్డు తయారీ ప్రసాదాల తయారీలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. యాదాద్రి దేవాలయం స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు లడ్డు ప్రసాదాలకు కొనుగోలు చేస్తుంటారు. భక్తుల నమ్మకం విశ్వాసాలకు తగ్గట్టే లడ్డు అనితలో ఎలాంటి లోపం లేకుండా నిపుణులు సూచించిన విధంగా దినుసులను వాడుతూ ప్రసాదాల తయారు చేస్తుంటారు. ప్రస్తుతం ప్రతీ రోజూ 100 గ్రాముల లడ్డులను 25,000 నుంచి 28 వేల వరకు చేస్తున్నారు. శని ఆదివారాల్లో వాటి సంఖ్య రెట్టింపుగా ఉంటుంది. లడ్డు తయారీకి మదర్ డైరీ నుంచి కేజీ నెయ్యి 6009 రూపాయలకు తీసుకుంటున్నారు. వెంటనే ఆ నెయ్యిని టెస్టింగ్ చేసి ధ్రువీకరణ పత్రాన్ని సైతం డైరీ నిర్వాహకులు పంపిస్తుంటారు. మదర్ డైరీ ద్వారా వచ్చిన నెయ్యి నాణ్యత ప్రమాణాలు తెలుసుకోవడానికి రాండెం గా నాచారంలోని ప్రభుత్వ ల్యాబ్ కు యాదాద్రి దేవాలయ అధికారులు పంపుతుంటారు. యాదాద్రి క్షేత్రంలో విక్రయించే ప్రసాదాలు పూర్తి నాణ్యత ప్రమాణాలు ఉన్నాయని చెప్పడానికి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో.. “ఆహార భద్రత భద్రత ప్రమాణాల ప్రాధికారిక సంస్థ”.. జాతీయ సర్టిఫికెట్.. “బ్లీస్ ఫుల్ హైజిన్ ఆపరేటింగ్ టు గాడ్” గుర్తింపు పంత్రాన్ని సైతం ఇచ్చింది. యాదాద్రి క్షేత్రంలో లడ్డు తయారీలో చిరుధాన్యాల ను వాడుతుంటారు. 80 గ్రాముల మిల్లెట్స్ లడ్డు ధర 40 రూపాయలు గాను.. 250 గ్రాముల బరువు కలిగిన పులిహోర ప్రసాదం 30 రూపాయలుగాను.. 500 గ్రాములు కలిగిన పెద్ద లడ్డు ధర 150 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు.