సిరా న్యూస్,ఏలూరు;
ఏలూరు పార్లమెంట్ టిడిపిలో పార్లమెంటు అభ్యర్థి విషయంలో ముసలం రోజురోజుకీ పెరుగుతోంది గోరుముచ్చు గోపాల్ యాదవ్ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. చెప్పడానికి ఏమి లేదు చాలా షాక్కు గురయ్యాను చాలా బాధాకరమైన విషయం అంటూ మొదలు పెడుతూ ఎక్కడో విదేశాల్లో ఉంటూ నలుగురికి ఉపాధి కల్పించుకుంటూ ఉన్నవాడిని చంద్రబాబు తీసుకొచ్చి రాజకీయ అవకాశాలు కల్పిస్తామని ఆశ పెట్టారు.. ఎమ్మెల్యే టికెట్టుగానీ ఎంపీ టిక్కెట్టు ఇస్తానని చెప్పి చెప్పింది మీరే కానీ నేను కొంత ఆశ్చర్యానికి గురయ్యాను. గత సంవత్సర కాలం నుంచి నుంచి కూడా మా నియోజకవర్గంలో ప్రతి ఊరురా గడపగడపకి తిరగడం మొదలుపెట్టాను. టిడిపి జెండా పట్టుకోవడానికి సాహసించనిరోజుల్లో నేను జెండా పట్టుకుని తిరిగాను. జయహో బీసీ సభలకు నా సొంత డబ్బులతో బస్సులు పెట్టి జనాలను తీసుకువెళ్ళాను. బీసీ డిక్లరేషన్ అని చంద్రబాబు చెప్పినప్పుడు బీసీలకు పెద్దపీట వేస్తారు అనుకున్నా. నన్ను పిలిచి టిక్కెట్ లేదని చెప్పి బీసీలు అంటే ఓన్లీ యనమల ఫ్యామిలీ,సుధాకర్ యాదవ్ ఫ్యామిలీ, రామకృష్ణుడి ఫ్యామిలీ అని నాకు తెలియదు. రాజకీయాలన్నీ యనమల రామకృష్ణ ఫ్యామిలీ గడప దాటకూడదు బీసీ లందరూ వాళ్ళ కుటుంబానికి ఊడిగం చేయాలి అనుకుంటే కుదరదని అన్నారు.
=================