సిరాన్యూస్, ఓదెల
సైబర్ నేరాలపై అవగాహన అవసరం : బ్యాంక్ మేనేజర్ యార్లగడ్డ మధుబాబు
సైబర్ నేరాల పట్ల ప్రజలు పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని యూనియన్ బ్యాంక్ మేనేజర్ మధుబాబు అన్నారు. బుధవారం పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పోత్కపల్లి యూనియన్ బ్యాంక్ మేనేజర్ మధుబాబు ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ మొబైల్ కు ఓటిపి వస్తే ఎవరికి చెప్పకూడదని, అపరిచితుని వల్ల ఫోన్ కాల్ వచ్చినా ఎలాంటి సమాచారం అందించవద్దని సూచించారు. అత్యాశకు పోయి సైబర్ క్రైమ్ ఆన్లైన్ మోసాలు ,లోన్ యాప్స్ గురవుతున్నారని తెలిపారు.ఎవరైనా ఆన్లైన్ మోసాలకు గురైతే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కి సమాచారం ఇవ్వాలని అన్నారు. కార్యక్రమంలో సబ్ మేనేజర్ శివ, ఫిల్ద్ ఆఫీసర్ ఖేమ్ చంద్, బ్యాంక్ సిబ్బంది. బ్యాంకు ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు.