సిరా న్యూస్, కళ్యాణదుర్గం
మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తాం
ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తామని యశ్వంత్ అన్నారు. కళ్యాణదుర్గంలో గురువారం సురేంద్రబాబు ను గెలిపించాలని ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కట్టెల పొయ్యి వాడటం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతారని, అధికారంలోకి రాగానే మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రజల దగ్గరకు వెళ్తే కష్టాలు తెలుస్తాయని, ఎంపీగా ఉండి ఏసీ కార్లలో తిరిగితే చలి వేస్తుంది తప్ప కష్టం గురించి ఎలా తెలుస్తుందని విమర్శించారు. ఎంపీగా ఉన్నప్పుడు కనీసం ఒక్కసారి కూడా ఈ గ్రామాన్ని పర్యటించలేదని, ఈరోజు అభివృద్ధి అంటే ఎలా నమ్మాలి, సురేంద్రబాబు రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి రైతు కష్టం తెలిసిన వ్యక్తి అని తెలిపారు. నిరుద్యోగ యువత కష్టం గెలిచిన వ్యక్తి సురేంద్రబాబు ఓటు వేస్తే అభివృద్ధి చెందిన కళ్యాణదుర్గం చూడొచ్చని చెప్పారు.