షర్మిల కాంగ్రెస్ లో కి వస్తున్నారు
ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు
సిరా న్యూస్,అమలాపురం;
అంబెడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రద్దరాజు మీడియాతో మాట్లాడారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నట్టు అధికారిక సమాచారం ఉంది. షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నట్లు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే చెప్పారు. షర్మిల పార్టీలోకి వస్తే స్వాగతిస్తాం. వైసిపి అసంతృప్త ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. త్వరలోనే వారు జాయినింగ్స్ ఉంటాయి. రాబోయే ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ వంద రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధమైంది. రాహుల్ గాంధీ మరో యాత్ర చేపట్టబోతున్నారు. త్వరలో చేపట్టబోయే స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి రాహుల్ ప్రియాంక గాంధీలు వస్తున్నారని అయన అన్నారు.