వ్యూహాత్మక తప్పిదాలతో వైసీపీ

సిరా న్యూస్,విజయవాడ;
రాజకీయాల్లో ఎప్పుడూ తప్పించుకునేందుకు ఓ దారిని పార్టీలు సిద్ధంగా ఉంచుకుంటాయి. అడ్డంగా దొరికిపోవాలని ఎవరూ అనుకోరు. అందుకే ఏదైనా సమస్య వస్తే తమ మాటాల్ని వక్రీకరించారనో తప్పుగా అర్థం చేసుకున్నారనో చెప్పి సర్దుకుంటారు. కానీ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతున్న లడ్డూ నెయ్యి కల్తీ అంశంలో వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్ మొత్తం వ్యవహారాన్ని తన పార్టీకి అంటించుకునే విషయంలో అత్యుత్సాహం ప్రదర్సించారు. తెలుగుదేశం పార్టీ, జనసేన జరిగిన తప్పును వైసీపీ, జగన్ తప్పు అని చెప్పడానికి ప్రయత్నించడం సహజం. అలాంటి సమయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన వైసీపీ, జగన్ పూర్తిగా దానికి బాధ్యత వహిస్తూ.. తెరపైకి వచ్చారు. తప్పేమీ జరగలేదని వాదిస్తూ పోతున్నారు. దీని వల్ల మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతోంది. తప్పు జరిగిందని నమ్మేవాళ్లంతా.. వైసీపీ, జగన్ వల్లే అనుకునే పరిస్థితి వచ్చేసింది. కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో చంద్రబాబు కల్తీ నెయ్యి గురించి ప్రస్తావించారు. ఖచ్చితంగా ఆ అంశం సంచలనం సృష్టిస్తుంది. వైసీపీ, జగన్‌పై ఉన్న అన్యమత ముద్ర కారణంగా ఇది మరింత సంచలనం అవుతుంది. అలాంటి సమయంలో ఏ పార్టీ అయినా ఆ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. సవాళ్లు, ప్రతి సవాళ్లు కాకుండా.. నిరూపంచాలని సవాల్ చేయాలి. అది కూడా.. ఈ వాదన అంతా.. టీటీడీలో బాధ్యులుగా ఉన్న వారినే ముందుగా పెట్టి నడిపించారు. వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డిలతో వివరణ ఇప్పిస్తే సరిపోయేది. కానీ నేరుగా జగన్ వచ్చి.. అసలు కల్తీ జరగలేదని చెప్పడం ద్వారా.. మొత్తం జరిగిన వ్యవహారం అంతా జగన్, వైసీపీ కనుసన్నల్లోనే జరిగిందన్న భావనకు జనం వచ్చేశారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. టీటీడీ స్వతంత్ర బోర్డు. అందులో సందేహమే లేదు. కానీ ప్రభుత్వ కనుసన్నల్లో నడుస్తుంది. కానీ సీఎం అయినా మరెవరు అయినా రోజువారీ వ్యవహారాలను చూడరు. నెయ్యి కొనుగోలు అంశంలో ఏం జరిగిందో టీటీడీలో పెద్దలకే తెలియాలి. అయితే ఏం జరిగినా బాధ్యులు..మాత్రం కాంట్రాక్టర్, టీటీడీలోని పెద్దలే . వారు వైసీపీ నేతలు అయినప్పటికీ.. బాధ్యత వారికే వ్యక్తిగంగా ఉంటుంది. కానీ ఈ వివాదాన్ని వైసీపీ మీదకు వచ్చేలా చేయడంలో వారి వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. లడ్డూ కల్తీ జరిగినట్లుగా తేలి ఉంటే అది ఖచ్చితంగా కాంట్రాక్టర్ తప్పిదమేనని.. అలాంటి వారికి అతి తక్కువ ధరకు కాంట్రాక్ట్ ఇచ్చిన పర్చేజింగ్ కమిటీదో.. లేకపోతే టీటీడీ పెద్దలదో అయి ఉంటుంది. ఇక్కడ పార్టీల ప్రస్తావన రాదు. కానీ వచ్చేలా చేయడానికి టీడీపీ, జనేసన చాలా సింపుల్ ట్రాప్ వేశారు. ఆ ట్రాప్ లో వైసీపీ, జగన్ పడిపోయారు. పలితంగా.. తిరుమలలో తప్పు జరిగిందని భావిస్తున్న ప్రతి ఒక్కరూ జగన్ వైపే చూస్తున్నారు. వైసీపీకి చాలా మంది రాజకీయల సలహాదారులు ఉన్నారు. అయితే వీరంతా లడ్డూ కల్తీ ఆరోపణల విషయంలో చంద్రబాబు చేసిన రాజకీయ వ్యాఖ్యల వ్యూహం ఏమిటో అర్థం చేసుకోలేకపోయారు. రాజకీయాల్లో ఆవేశం కంటే ఆలోచన ముఖ్యం. కానీ వైసీపీ ఆవేశంగా స్పందించింది. లాజికల్ గా వివరణ ఇవ్వడానికన్నా ఎదురుదాడి చేయడానికి ప్రాధాన్యం ఇచ్చింది. ఫలితంగా ఈ వివాదం వైల్డ్ ఫైర్ లా అంటుకుంది. ఇప్పుడు విచారణ జరగడం ఖాయం. అందులో కల్తీ కూడా తేలడం ఖాయం. ఇతర విషయాలు కూడా బయటకు వస్తాయి. ఇప్పటికే దర్శనాల బ్లాక్ మార్కెటింగ్ పై ప్రచారం జరుగుతోంది. ఇలా వచ్చే ప్రతి అంశాన్ని ఇక వైసీపీకి, జగన్ కే ముడిపెడతారు. వైసీపీ సమాధానాలు చెప్పుకుంటూ ఉండాల్సిందే. ఎందుకంటే ఇప్పటికే ట్రాప్‌లో ఇరుక్కుపోయారు. లడ్డూ వివాదాన్ని తమపై వేసేసుకున్నారు. ఇక జరగబోయే రాజకీయంలో సర్వైవల్ స్టెప్స్ తెలివిగా వేయాల్సి ఉంటుంది.
=============================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *