నువ్వు సెలెక్టెడ్ అజ్ఞానివి..ఎలక్టేడ్ మేయర్ వు కాదు..!

-ఎవరు నామినీ.. బినామీ ఎవరో కరీంనగర్ ప్రజలకు తెలుసు

-సునీల్ రావు ప్యారాచూట్ లీడరే కాకుంటే తెలంగాణ ఉద్యమంలో అతడి ఎక్కడ..?

-బండి సంజయ్ పై విమర్శలు చేయడమంటే సూర్యుడిపై ఉమ్మేసినట్లే..

-మీడియా సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిలపు రమేష్

సిరా న్యూస్,కరీంనగర్;
యాదగిరి సునీల్ రావు సెలెక్టెడ్ అజ్ఞాని అని ఎలెక్టెడ్ మేయర్ మాదిరిగా మాట్లాడడం లేదని, నామిని ఎవరో, బినామీ ఎవరో కరీంనగర్ నగర ప్రజలకు బాగా తెలుసని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిదని, నోటికొచ్చినట్లు మాట్లాడితే తిరిగి అదే స్థాయిలో ప్రతిఘటనలు తప్పవని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ళపు రమేష్, మేయర్ సునీల్ రావుకు హితువు పలికారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుగ్గిళ్ళపు రమేష్ మాట్లాడుతూ సునీల్ రావు ప్యారాచూట్ లీడర్ కాకుంటే తెలంగాణ ఉద్యమంలో అతడి పాత్ర ఏ మేరకు ఉందో శ్వేతా పత్రం విడుదల చేసే దమ్ముందా అని సవాల్ విసిరారు. కాంగ్రెస్ను తెగ పొగుడుతున్న సునీల్ రావు తిరిగి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్లో చేరుతారా అనే ఆశ్చర్యం కలుగుతుందన్నారు. చరిత్ర గురించి నీతులు చెప్పే సునీల్ రావు కాంగ్రెస్ లో గోతులు తవ్వి పైకి వచ్చారని ఆరోపించారు. నీ గత చరిత్రను తవ్వితీస్తే కరీంనగర్లో తిరగలేవని హెచ్చరించారు. రాజకీయ అవగాహన రాహిత్యంతో పసలేని ఆరోపణలు చేసి చరిత్రలో సునీల్ రావు స్క్రాప్ గా రుజువయ్యాడని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ పై పర్సనల్గా విమర్శలు చేసి నవ్వుల పాలయ్యాడని దుయ్యబట్టారు. కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి కోసం సుమారు 8000కోట్ల అభివృద్ధి పనులను తీసుకొచ్చిన ఘనత ఎంపీ బండి సంజయ్ కుమార్ కే దక్కుతుందన్నారు. బండి సంజయ్ పై ఆరోపణలు చేయడం అంటే సూర్యుడు పై ఉమ్మేసినట్లేనని చెప్పారు సునీల్ రావు వినోద్ కుమార్ కు బినామీ కాకుంటే ఎందుకు అంత ఉలికి పాటని ఆగమేఘాల మీద ప్రెస్ మీట్ పెట్టి పనికి లేని పస లేని విమర్శలు ఎందుకు చేశారో సునీల్ రావు మాట్లాడిన తీరును చూస్తుంటే అర్థమవుతుందన్నారు. సునీల్ రావు కేరఫ్ కాంగ్రెస్ అని ఎప్పటికీ బిఆర్ఎస్ కాలేడని విమర్శించారు. అందుకే అదే స్థాయిలో కాంగ్రెస్లో ఎంతో కష్టపడ్డానని చెప్పడం తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్తున్నాడని సంకేతాలు ఇవ్వడం స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *