కాంగ్రెస్ పార్టీకి యూత్ కాంగ్రెస్ పునాది లాంటిది

-ఘనంగా యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
-ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
-యూత్ కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ చేసిన దుద్దిల్ల శ్రీనుబాబు
సిరా న్యూస్,మంథని;
కాంగ్రెస్ పార్టీకి యూత్ కాంగ్రెస్ పునాది లాంటిదని,దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చెందటానికి ప్రధాన కారణం యువజన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చేస్తున్న కృషి కారణమని కాంగ్రెస్ పార్టీ యువ నేత, శ్రీపాద ట్రస్ట్ చైర్మన్, మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు దుద్దిల్ల శ్రీనుబాబు అన్నారు శుక్రవారం పట్టణములో ఏర్పాటు చేసిన యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని యూత్ కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ చేశారు. కేక్ కట్ చేసి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు శ్రీను బాబు యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మే 30వ తేదీన మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన సందర్భంగా రక్తదానం చేసిన వారికి ప్రశంస పత్రాలను శ్రీను బాబు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీను బాబు మాట్లాడుతూ యూత్ కాంగ్రెస్ లో పనిచేసిన ప్రతి ఒక్కరు క్రమశిక్షణ కల్గిన నాయకునిగా ఉంటారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.గత పది సంవత్సరాలు పార్టీ అధికారం లేనప్పుడు పార్టీ అభ్యున్నతి కోసం యూత్ కాంగ్రెస్ నాయకులు చాలా కష్ట పడ్డారని గుర్తి చేశారు. ప్రతి ఒక్క యూత్ కాంగ్రెస్ కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని అన్నారు. యూత్ కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని
పిలుపునిచ్చారు. అనంతరం పట్టణంలోని మహా లక్ష్మి ఆలయంలో దుద్దిల్ల శ్రీను బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు.నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మహాలక్ష్మి దేవిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎరుకల ప్రవీణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు జెమినీ గౌడ్, ఆర్ల నాగరాజు, బండ కిషోర్ రెడ్డి, బర్ల శీను, యూసఫ్ లల్లు, సాదలశ్రీకాంత్, తాటి శ్రీధర్, పోరండ్ల రంజిత్, దాడి క్రాంతి, ఎరుకల సురేష్, మంథని మున్సిపల్ చైర్మన్ పెండు రామా సురేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయిలి ప్రసాద్, పోలు శివ, ఓడ్నాల శ్రీనివాస్, పేరవేణ లింగయ్య యాదవ్, మంతెన సత్యం, ఆరేల్లి కిరణ్ గౌడ్ లతోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
=======

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *