సిరాన్యూస్, జైనథ్
రైతులు అధైర్య పడొద్దు: యూత్ కాంగ్రెస్ మండల నాయకుడు సదలి శివ్వన్న
రుణమాఫీ కానీ రైతులు అధైర్య పడొద్దు, రైతులందరికీ రుణమాఫీ అవుతుందని యూత్ కాంగ్రెస్ జైనథ్ మండల నాయకుడు సదలి శివ్వన్న అన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు లక్షల పైనున్న రైతులకు కూడా త్వరలో కొత్త గైడ్లైన్స్ వస్తాయని ,ఎవరు అధర్య పడద్దని రైతులకు ధైర్యం చెప్పారు. త్వరలో స్పెషల్ డ్రైవ్ చేపట్టి రైతులందరికీ రుణమాఫీ అవుతుందన్నారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల కాలేదన్నారు. ఏఈఓ లతో సమాచారం సేకరించి వంద శాతం ఋణం మాఫీ కోసం జిల్లా నాయకుల ద్వారా అదిష్టానానికి విన్నవిస్తామని తెలిపారు. రైతులు ప్రతిపక్ష నాయకుల మాటలు నమ్మవద్దన్నారు. సమావేశంలో యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.