Youth Congress Sama Rupesh Reddy: నిరుపేద కుటుంబానికి బీమా చేయించిన సామ రూపేష్ రెడ్డి

సిరాన్యూస్‌, బేల‌
నిరుపేద కుటుంబానికి బీమా చేయించిన సామ రూపేష్ రెడ్డి

రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబానికి తన వంతు సహకారాన్ని అందించాలన్న సదుద్దేశంతో ఇప్పటికే సామాజిక సేవలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్న యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రుపేష్ రెడ్డి మరో అడుగు ముందుకు వేసి ఓ ఆదివాసి కుటుంబానికి అండగా నిలిచారు. ఒక మంచి నిర్ణయంతో వారిని కలిసి 20 సంవత్సరాల పాటు వారి పేరు మీద బీమా పాలసీ ఆయన చెల్లించారు.ఈ మేరకు బుధవారం ఎల్ఐసి ఏజెంట్ గౌకర్ సంజేయ్ తో కలిసి వారి కుటుంబ సభ్యులకు ఎల్ఐసి బీమా పత్రాలను స్వయంగా అందజేశారు.అంతకు ముందు వారి ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకున్న సామ రూపేష్ రెడ్డి బుధవారం ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని మశాలా(బి) గ్రామానికి చెందిన ఆదివాసి నిరుపేద కుటుంబం ఇంటికి చేరుకున్నారు.5,500 రూపాయలతో ఆ కుటుంబం పై బీమా చేసి చెల్లించిన పత్రాలను అందజేయడంతో పాటు వారి ఆర్థిక స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.సామ రూపేష్ రెడ్డి పాలసి గడువు 20 సంవత్సరాలు ఉండగా ఆ నిరుపేద కుటుంబం తరుపున బీమా డబ్బులు ప్రతి ఏటా తానే చెల్లిస్తానని ఆ కుటుంబానికి భరోసా కల్పించారు.ఈ మేరకు ఎల్ఐసి ఏజెంట్ గౌకర్ సంజయ్ తో కలిసి ఆ నిరుపేద ఆదివాసి అదే సంగీత ఉసేన్ ఇంటికి చేరుకుని వారితో మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న ఆయన ఆ కుటుంబానికి బీమా డబ్బులు చెల్లించడంతో వారు కృతజ్ఞతలు తెలియజేశారు.ఆయన వెంట యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అవినాష్,దోటే ఈశ్వర్,ఆకాష్,అక్షయ్ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *