సిరాన్యూస్, బేల
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి
ఆదిలాబాద్ జిల్లా బేల మండలం దుబ్బగూడ గ్రామంలో రేషన్,కరెంటు స్తంభాలు,రోడ్డు సమస్యలతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి గ్రామస్తులతో మాట్లాడి వాటిని పరిష్కరిస్తామని శుక్రవారం వారికి భరోసా కల్పించారు.ముఖ్యంగా ఆదిలాబాద్ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క దృష్టికి సమస్యలు తీసుకువెళ్లి దుబ్బగూడ ఆదివాసి ప్రజలకు న్యాయం చేస్తామని అన్నారు.ఇంకా భవిష్యత్తులో ఏ సమస్య ఉన్న తనకు తెలియజేసినట్లయితే అధికారుల ద్వారా దాన్ని పరిష్కరించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా గ్రామంలో ఇంకా వారు ఎదుర్కొంటున్న సమస్యలను గ్రామస్తులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.ఆయన వెంట ప్రమోద్ రెడ్డి,గ్రామస్తులు మాజీ సర్పంచ్ టేకం రాజు,ఆత్రం సోనేరావు,కొడప లంకు,మడవి జంగు,కోమ్ర రాజు,టెకం మొకషే,లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.