Youth Congress Sama Rupesh Reddy: సీఎం, మంత్రుల చిత్రపటానికి పాలాభిషేకం: యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి

సిరాన్యూస్, బేల‌
సీఎం, మంత్రుల చిత్రపటానికి పాలాభిషేకం: యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి
* రైతులను ఆదుకున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వందే

గడచిన నెల రోజుల క్రితం ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో బేల మండలంలో పెనుగంగా పరివాహక ప్రాంతంతో పాటు ఆయా ప్రాంతాలలో వచ్చిన వరదలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం దేనని ఆ పార్టీ మండల నాయకులు సామ రూపేష్ రెడ్డి అన్నారు. గురువారం బాధిత రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ఆదిలాబాద్ జిల్లా బేల మండలం బేధోడ గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క,ఉమ్మడి జిల్లా ఇంచార్జీ మంత్రి సీతక్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,ఆదిలాబాద్ నియోజక వర్గ ఇంచార్జీ కంది శ్రీనివాస్ రెడ్డి ఫోటోలతో కూడిన ఫ్లెక్సికి మండల రైతులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు.ఈసంద‌ర్బంగా ఆదిలాబాద్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి ,బేల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఫైజూల్లా ఖాన్ లు మాట్లాడుతూ ఇప్పటికైనా కొందరు కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు చేసేవారు బుద్ధి తెచ్చుకోవాలన్నారు. నష్టపోయిన రైతులకు నెల‌ రోజుల్లోనే నష్టపరిహారాన్ని చెల్లించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దగ్గుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం అన్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు.రాబోయే రోజుల్లోనూ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని,వారు పండించిన పంటకు మద్దతు ధర తో కొనుగోలు చేసేవిధంగా చర్యలు తీసుకుంటుందని రైతులకు భరోసా కల్పించారు.  కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి రాందాస్ నాక్లె,జైనథ్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విలాస్ పాటేల్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వామన్,బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సంజయ్ గుండావార్,కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు గాన్ శ్యామ్,మాజీ సర్పంచ్ రూప్ రావు,ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు చంద్రకాంత్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గోడే అవినాష్, యువజన కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు ఠాక్రే విపిన్, బొక్రే శంకర్, ఠాక్రే సాగర్, గ్రామస్తులు అశోక్ పటేల్, దర్నె విజయ్, సురేందర్, రాందాస్, తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *