సిరా న్యూస్,మెదక్;
మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఘనపూర్ శివారులోని కంకర క్వారీలో కార్మికుడు సునీల్ కుమార్ (28) అనుమానాస్పద మృతి చెందాడు. మృతుడు అక్కడ బ్లాస్టింగ్ సెక్షన్లో పని చేస్తున్నాడు. క్రషర్ నిర్వహకులు సెల్ఫోన్ పేలి చనిపోయాడంటున్నారు. అయితే , బ్లాస్టింగ్ కోసం అమర్చిన బాంబులు పేలి చనిపోయాడన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కడుపులో తీవ్ర గాయాలు కావడంతో అనుమానాలు బలపడుతున్నాయి. మహారాష్ట్ర చెందిన కార్మికుడు కావడంతో యాజమాన్యం పట్టించుకోవడంలేదు. కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని స్థానికులు అంటున్నారు. విచ్చలవిడి బ్లాస్టింగ్లతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు.