Youth Icon Vivekananda: యువతకు స్ఫూర్తి స్వామి వివేకానంద…

సిరా న్యూస్, ఆదిలాబాద్:

యువతకు స్ఫూర్తి స్వామి వివేకానంద…

-బ్లూ భీమ్ యూత్ అధ్యక్షుడు ప్రేమెందర్

యువత స్వామి వివేకానందుని జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని, సేవా కార్యక్రమాలతో ముందుకు సాగాలని బ్లూ భీమ్ యూత్ అధ్యక్షుడు గొంటిముక్కుల ప్రేమెందర్ అన్నారు. గురువారం తలమడుగు మండల కేంద్రంలో వివేకానందుని జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక యువకులు, నాయకులతో కలిసి వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… యావత్ భారతదేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉందని, యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యమని ఆయన అన్నారు. యువత వ్యసనాలను వీడి సన్మార్గంలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆనంద్ రెడ్డి, శివ, అజయ్, మహేష్, విలాస్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *