Zella Srinivas: కట్కూర్‌కు నూతన బస్సు ప్రారంభం : కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు జెల్లా శ్రీనివాస్

సిరాన్యూస్‌,సైదాపూర్:
కట్కూర్‌కు నూతన బస్సు ప్రారంభం : కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు జెల్లా శ్రీనివాస్
* ప్రజలు అందరూ ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించాలి

రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు గోదావరిఖని నుండి కట్కూర్ వయా కరీంనగర్ వరకు నూతన బస్సును శుక్రవారం ప్రారంభించారు.సైదాపూర్ మండలంలోని ఆకునూర్ గ్రామంలో ఉదయం 10:00 గంటలకు ఆకునూర్ గ్రామ బస్టాండ్ వద్ద గ్రామశాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జెల్లా శ్రీనివాస్, జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు గుండారపు శ్రీనివాస్, గ్రామ ప్రజలు స్వాగతం పలికి నూతన బస్సుకు కొబ్బరికాయలు కొట్టి జెండా ఊపి బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆకునూర్ గ్రామశాఖ అధ్యక్షుడు జెల్లా శ్రీనివాస్, జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు గుండారపు శ్రీనివాస్ మాట్లాడుతూ అనుకున్నదే తడవుగా వెంటనే స్పందించి ప్రజలకు ఏ అవసరం ఉన్నా క్షణాల్లో చేసిపెట్టే గొప్ప మనసున్న నేత మంత్రి పొన్నం ప్రభాకరని అన్నారు. సైదాపూర్ మండలంలో ఇప్పటీవరకు మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్-హుజురాబాద్ వయా దుద్దెనపల్లి, హుస్నాబాద్-హుజురాబాద్ వయా సర్వాయిపేట్, గోదావరిఖని-కట్కూర్ వయా కరీంనగర్ వరకు మూడు బస్సులను మంజూరు చేశారని ఆనందం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలలో భాగంగా మహిళల సౌకర్యార్థంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉచిత బస్సు స్కీమ్ ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారని మహిళలు ఉచిత బస్సులో రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణింవచ్చునని అన్నారు. సైదాపూర్ మండలం చుట్టూ ఉన్న గ్రామాల ప్రజలు మహిళలు ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించాలని కోరారు. గత ప్రభుత్వం వైఫల్యం వల్లనే రెగ్యులర్ గా తిరిగే బస్సులు అర్ధాంతరంగా ఆపివేసారని నేడు మంత్రి పొన్నం ప్రభాకర్ చొరువతో ప్రజలకు సురక్షితమైన సౌకర్యవంతమైన రవాణా సౌకర్యం కల్పించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు జెల్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు నాగిరెడ్డి సంపత్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులకు గుండారపు శ్రీనివాస్, మాజీ సర్పంచులు రాయిశెట్టి చంద్రయ్య, తడిచిన వెంకట్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మిట్టపెళ్ళి కిష్టయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దొంత సుధాకర్, సీనియర్ నాయకులు గుర్రాల లింగారెడ్డి, గొల్లపల్లి సంపత్, కొల్ల మోహన్ రెడ్డి, ఆరెపల్లి కుమార్,ఎం.డి హాజీ, ఎర్రల శ్రీనివాస్, గిద్దె మొగిళి ఎండి అన్వర్ పాషా, మహిళా నాయకురాలు మద్దూరి రజిత, ఎండి గౌసియా, చిట్టి వాణి, గాలిపెల్లి ప్రమీల, బొడిగే శ్రావ్య, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *