ZP CEO Jitender Reddy: గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలి : జ‌డ్పీ సీఈవో జితేందర్ రెడ్డి

సిరాన్యూస్‌, ఇచ్చోడ
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలి : జ‌డ్పీ సీఈవో జితేందర్ రెడ్డి
* జున్నిలో పారిశుద్ధ్య పనులను పరిశీలన‌

గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజలకు ఎలాంటి సీజనల్ వ్యాధులు తలెత్తకుండా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న డ్రై డే ఫ్రైడే ను సమర్ధవంతంగా నిర్వహించాలని అధికారులకు జ‌డ్పీ సీఈఓ జితేందర్ రెడ్డి సూచించారు. శుక్రవారం అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని జున్ని గ్రామపంచాయతీలో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. అనంతరం డ్రైడే ఫ్రైడే కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రైడేను నిర్వహించి , సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామస్తులను చైతన్య పరచాలని అన్నారు. వాటర్ ట్యాంకులను శుభ్రపరచాలని, అవెన్యూ, డివైడర్ ప్లాంటేషన్ల కు తప్పనిసరిగా నీరు పట్టాలని , తద్వారా మొక్కలు సంరక్షించబడాలని చెప్పారు. చెట్లకు పాదులు, సపోర్టింగ్ కర్రలు , పిచ్చి మొక్కలు తొలగింపు ద్వారా ప్లాంట్ కేర్ యాక్టివిటీస్ లను పర్యవేక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి కొండ లక్ష్మణ్, మండల పంచాయతీ ఇంచార్జి అధికారి ఆనంద్, గ్రామపంచాయతీ కార్యదర్శి మహమ్మద్ అష్రఫ్, అంగన్వాడి టీచర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *