సిరాన్యూస్,బోథ్
వాతావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి: జడ్పీ సీఈవో కలిందా
భావితరాల వారిని దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుండి మొక్కలను నాటాలని జిల్లా పరిషత్ సీఈవో కలిందా పేర్కొన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భవిష్యత్తు సమాజం ఇబ్బందులకు గురికాకుండా ప్రతి ఒక్కరూ కనీసం రెండు మొక్కలనైన నాటాలని, వాటిని పరిరక్షించాలని సూచించారు. వాతావరణ సమస్యలు మొక్కల పాత్ర ఎంతో ఉంటుందన్నారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి కిరణ్ కుమార్, ఎంపీడీవో జీవన్ రెడ్డి, ఉపాధి హామీ ఏపీవో జగ్డే రావు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ కళ్యాణ్, గ్రామపంచాయతీ ఈవో అంజయ్య తోపాటు ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.