ZP Chairman Sudhir Kumar: దళిత సామాజిక వర్గాన్నిమోసం చేసిన కాంగ్రెస్ :  జడ్పీ చైర్మన్ మారపల్లి సుధీర్ కుమార్

సిరాన్యూస్‌,భీమదేవరపల్లి
దళిత సామాజిక వర్గాన్నిమోసం చేసిన కాంగ్రెస్ :  జడ్పీ చైర్మన్ మారపల్లి సుధీర్ కుమార్
* అంబేద్కర్ అభయ హస్తం ఏమాయే..?

అంబేద్కర్ అభయహస్తం పేరిట రూ.12 లక్షలు ఇస్తానని చెప్పి దళిత సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్ మారపల్లి సుధీర్ కుమార్ విమర్శించారు. సోమవారం భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆదివారం మాణిక్యపూర్ లో నిర్వహించిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభలో రాజకీయాలు మాట్లాడింది కాంగ్రెస్ నాయకులు అని పేర్కొన్నారు. అంబేద్కర్ సభలో జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేయడాన్ని తప్పుపట్టారు. దళితుల పక్షాన అంబేద్కర్ సభలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్ప అని అన్నారు. అంబేద్కర్ సభ వేదికపై తన నుండి మైక్ తీసుకుని ఆమర్యాదగా ప్రవర్తించడం పట్ల మండిపడ్డారు. మంత్రి సమక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించానే తప్ప రాజకీయాలు మాట్లాడలేదని హితవు పలికారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గతంలో ఎంపీగా ఉన్నప్పటినుండి దళిత సామాజిక వర్గానికి చేసింది ఏమీ లేదని ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో దోషిగా ఉన్న రేవంత్ రెడ్డి, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం మన దౌర్భాగ్యం అని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం కోసం కష్టపడి, ఉద్యమాలు చేసి సాధించుకున్నామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతుందని విమర్శించారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఏ యొక్క హామీని అమలు చేయలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని ఆరు గ్యారంటీల అమలు అయ్యేవరకు విడిచి పెట్టేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జక్కుల అనిత రమేష్ మండల అధ్యక్షులు మండల సురేందర్ అప్పని బిక్షపతి మాడుగుల అశోక్ సదానందం కనకం నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *