సిరా న్యూస్, ఇంద్రవెల్లి:
మానవత్వం చాటిన జడ్పీ చైర్మెన్ జనార్ధన్ రాథోడ్
ఆదిలాబాద్ జడ్పీ చైర్మెన్ జనార్ధన్ రాథోడ్ మానవత్వం చాటుకున్నారు. ముత్నూర్ వద్ద ఆటో ప్రమాదంలో గాయపడిన వ్యక్తులను దెగ్గరుండి 108లో ఎక్కించి, ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే… ఇంద్రవెల్లి నుండి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న ఆటో ముత్నూర్ వద్ద బోల్తా పడింది. కాగా అదే సమయానికి అటుగా వెళ్తున్న జడ్పీ చైర్మెన్ రాథోడ్ జనార్ధన్ తన వహానాన్ని ఆపి క్షతగాత్రులకు సహాయం చేసారు. 108కు సమాచారం అందించి వారిని ఆసుపత్రికి తరలించారు. పక్కవాడు ఏమైతే నాకెందుకులే అనుకునే ఈ రోజుల్లో… రోడ్డుపై ఉన్న క్షతగాత్రుల కోసం టై వెచ్చించి, వారిని ఆసుపత్రికి తరలించిన జడ్పీ చైర్మెన్‌ను ‘రియల్ లీడర్’ అంటూ జనం మెచ్చుకుంటున్నారు.