చిగురుమామిడి, సిరా న్యూస్
ఆరు గ్యారెంటీల అమలుకు కట్టుబడి ఉన్నాం
జెడ్పీ ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్
అమలు కాని ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి మళ్లీ అధికారంలోకి రావాలని చూసింది బీఆర్ఎస్ పార్టీయేనని జెడ్పీ ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్ విమర్శించారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేవకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు చెప్పిన బూటకపు మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించలేదన్నారు. గత 9 సంవత్సరాల పాలనలో కొత్త రేషన్ కార్డుల జాడే లేదని, డబుల్ బెడ్ రూమ్ ఊసే లేదని, కొత్త పింఛన్లు ఇవ్వలేదని దుయ్యబట్టారు. దళిత బంధు, బీసీ బంధు పేర ఓట్లు దండుకోవాలనుకున్నారు. దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి, రైతులకు ఉచిత ఎరువుల పంపిణీ లాంటి పథకాలను తుంగలో తొక్కారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల హామీలను ఇస్తే ఒక అడుగు ముందుకేసి రైతుబంధు రూ.15వేలు, 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్, వృద్ధులకు 5వేలు వికలాంగులకు రూ. 6 వేలు పింఛన్ ఇస్తామంటే ప్రజలు బీఅర్ఎస్ ను ఎందుకు నమ్మలేదో చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల అమలుకు శ్రీకారం చుట్టిందనీ, ఇప్పటికే రెండు పథకాలు అమలయ్యాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నారనీ, ప్రజా పాలనతో ప్రజలకు మరింత దగ్గరౌతున్నారన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చిటుమల్ల రవీందర్, డీసీసీ అధికార ప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత, మండల ప్రధానకార్యదర్శి పూల లచ్చిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు వరుకోలు సంతోష్, గట్టు ప్రశాంత్, జిల్లెల్ల రమేష్, కోనేటి రాములు, ఆకుల మల్లిఖార్జున్, కవ్వంపల్లి సంజీవ్, జిల్లెల్ల భగవాన్ ప్రసాద్, దుళిమిట్ట నర్సింహారెడ్డి, పోటు మల్లారెడ్డి, అల్లి భాస్కర్, వంగాల రాఘవ రెడ్డి, సుంకరపల్లి అంజి, ఒంటెల మల్లారెడ్డి, సురుగూరి తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.