ZPTC to MLA-Anil Jadhav: జడ్పిటీసీ టూ ఎమ్మెల్యే…

సిరా న్యూస్, బజార్‌హత్నూర్‌:

జడ్పిటీసీ టూ ఎమ్మెల్యే…

+ జడ్పిటీసీ పదవికి రాజీనామ చేసిన అనిల్‌ జాదవ్‌

ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బోథ్‌ ఎమ్మెల్యేగా గెలుపొందిన అనిల్‌ జాదవ్‌ తన జడ్పిటీసీ పదవికి రాజీనామ చేసారు. ఈ మేరకు గురువారం ఆయన ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌ను కలిసి తమ రాజీనామా పత్రాన్ని అందజేసారు. గత ఎన్నికల్లో జడ్పిటీసీగా గెలుపొందిన అనిల్‌ జాదవ్‌ తన పదవి కాలం ముగియకముందే ఎమ్మెల్యేకు పోటీ చేసి, గెలవడంతో రాజీనామ చేయాల్సి వచ్చింది. దీంతో ప్రస్తుతం జడ్పిటీసీ స్థానం ఖాలీగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *