ఏ వ్యక్తుల్ని ఉద్దేశించి కాదు.. ఓ వ్యవస్థని ఖండిస్తూ తీసిన సినిమా ‘కోట బొమ్మాళి పీఎస్‌’: ‘ఏస్ ప్రొడ్యూసర్’ అల్లు అరవింద్

                                                                                      (సిరా న్యూస్);             

రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ లీడ్‌ రోల్స్‌లో ‘అర్జున ఫల్గుణ’ ఫేమ్ తేజ మార్ని తెరకెక్కించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్‌’. శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్‌ కుమార్ కీలకపాత్రలలో నటించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్ 24న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కాబోతోంది. చిత్ర ప్రమోషన్స్‌ను యూనిట్ వినూత్నంగా నిర్వహిస్తోంది. సోమవారం ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను ‘కోట బొమ్మాళి పీఎస్ ప్రచార సభ‌’ పేరుతో హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఇందులో స్టేజ్‌పైకి వచ్చిన వారంతా ఓటు వేసే థీమ్‌తో పాటు, ఎప్పుడూ మీడియా వారే సినిమా వాళ్లని ప్రశ్నలు అడిగే ట్రెండ్‌కు బ్రేక్ వేస్తూ.. మీడియా వారిని స్టేజ్‌పై కూర్చోబెట్టి సినిమా వారు ప్రశ్నలు అడిగారు. ఈ కార్యక్రమం అందరినీ అలరించింది. అనంతరం చిత్ర బృందం సినిమా విశేషాలను తెలిపితే.., హాజరైన అతిథులు యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *