సిరా న్యూస్, పెంబి:
ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు, పించన్లు, నిరుపేదలకు ఉచిత భూములు… వంటి ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసిన కాంగ్రేస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని జవహర్ బాల మంచ్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు తులాల శంకర్, పెంబి గ్రామపంచాయతీ వార్డు సభ్యుడు గుగ్గిళ్ల భూమేష్ అన్నారు. పెంబి మండలంలోని దొందరి, పస్పుల, కోషగుట్ట తదితర గ్రామాల్లో ఇంటింట ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరు చేయ్యి గుర్తుకు ఓటు వేసి, వెడ్మా బొజ్జు పటేల్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలని నెరవేర్చడంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, రానున్న ఎన్నికల్లో వెడ్మా బొజ్జు పటేల్‌ను గెలిపిస్తే గ్రామాలను అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు.