శ్రీశైలం,(సిరా న్యూస్);
శ్రీశైల దేవస్థానం లో కార్తీకమాసోత్సవాల సందర్భంగా పలు ధార్మిక మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ కార్యక్రమాలలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు శ్రీశైలదేవస్థానం మరియు జాతీయ నేషనల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటరల్ దక్షిణప్రాంతీయ కేంద్రం, బెంగళూరు వారి సంయుక్త నిర్వహణలో నిర్వహించబడుతున్నాయి. మరికొన్ని కార్యక్రమాలు దేవస్థానం పక్షాన ఏర్పాటు చేయబడుతున్నాయి.మంగళవారం రోజు N.C.R.T వారి సౌజన్యంతో ప్రఖ్యాత నాట్య కళాకారులు మరియు భారత ప్రభుత్వ స్కాలర్ షిప్ అవార్డు గ్రహీత గురుక్రాంతికిరణ్ మరియు వారి బృందం, హైదరాబాద్ వారిచే సంప్రదాయ నృత్యప్రదర్శన ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమములో వినాయక నృత్యం, నమశ్శివాయ, హిమగిరితనయే, అంబాపరమేశ్వరి తదితర గీతాలకు పొన్నూరు హాస్య పద్మావతి, వి. వెన్నెల, సి. చిన్మయి. డి. చర్వితారెడ్డి, లక్ష్మీ అభీష్ట శ్రీలక్ష్మీ అక్షితల,ఎం. రేణుప్రియ, ఎం. లాస్యప్రియ, ఎం. బ్రాహ్మణి తదితరులు నృత్య ప్రదర్శన చేసారు.