సికింద్రాబాద్ ,(సిరా న్యూస్);
కుటుంబ పాలనకు చరమగీతం పాడుదాం..రాష్ట్రాన్ని రక్షించుకున్దామని అని సికింద్రాబాద్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి మేకల సారంగా పాణి అన్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా తార్నాక డివిజన్ లోని చింతల్ బస్తీ, తార్నాక, గోకుల్ నగర్, సండే మార్కెట్, నాగార్జున నగర్, హనుమాన్ నగర్ ప్రాంతాల్లో మేకల సారంగా పాణి పాదయాత్ర చేపట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజా వ్యతిరేక పాలనను అవలభిస్తున్న బీ ఆర్ ఎస్ ప్రభుత్వంకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు.బిజెపి ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం పెద్ద పీఠ వేసినట్లు పేర్కొన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం లో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని,ఈసారి బిజెపి ప్రభుత్వం అధికారం లోకి రావడం ఖాయమని అన్నారు.బీసీ ల పక్షపాతి మోడీ అని, తెలంగాణ లో బిజెపి బీసీ ముఖ్యమంత్రి నీ ప్రకటించడం హర్షణీయం అని పేర్కొన్నారు. సికింద్రాబాద్ లో బిజెపి జెండాను ఎగురవేస్తారు తెలిపారు. ఈ కార్యక్రమం లో బిజెపి తార్నాక డివిజన్ అద్యక్ష్యులు రాము వర్మ, వేణు యాదవ్, వెంకటేష్ గౌడ్, పోచయ్య యాదవ్, సుబ్బారావు, ప్రకాష్, అనిత,అనూష, వేణు తదితరులు పాల్గొన్నారు