నెల్లూరు, (సిరా న్యూస్);
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న కుల గణన ప్రక్రియను తాత్కలికంగా వాయిదా వేశారు. ఈ విషయాన్ని ్మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 27వ తేదీ నుండి కుల గణన ప్రక్రియ మొదలుపెట్టాలని నిర్ణయించింది. ఇందు కోసం సన్నాహాక శిబిరాలను కూడా పూర్తి చేశారు. పూర్తి స్థాయి కులగణనకు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 27 నుంచి వారం రోజుల్లో కులగణన చేయాలనుకున్నారు. కనీ ఇప్పుడు డిసెంబర్ 10వ తేదీ నుండి చేపట్టాలని నిర్ణయించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం కొనసాగుతోంది. దీంతో పాటుగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో, కులగణన కార్యక్రమాన్ని డిసెంబర్ 10వ తేదీ వరకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కులగణన సర్వేను వారం రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నిర్ణయాల్లో సవరణ చేసింది. ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టు కింద వేర్వేరు చోట్ల మూడు గ్రామ సచివాలయాలు, రెండు వార్డు సచివాలయాల పరిధిలో సర్వే నిర్వహించారు. ఈ నెల 27 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కసరత్తు పూర్తి చేసింది