చిత్తూరు, (సిరా న్యూస్);
చిత్తూరు జిల్లా సోమల మండలంలో దారుణం జరిగింది. సోమల జగనన్న కాలనీ సమీపంలో గుర్తుతెలియని మహిళ మృతదేహన్ని మంగళవారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు పరిశీలించగా మహిళను పెట్రోల్ పోసి కాల్చి చంపినట్లు గుర్తించారు. సగం శరీరం కాలిపోవడంతో గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహం ఉంది. సంఘటన స్థలంలో మద్యం బాటిళ్లు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.