నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్, శౌర్యువ్, వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘హాయ్ నాన్న’ ట్రైలర్ నవంబర్ 24న విడుదల

                                                                                      (సిరా న్యూస్);
నేచురల్ స్టార్ నాని హోల్సమ్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘హాయ్ నాన్న’.  వైర ఎంటర్‌టైన్‌మెంట్ మొదటి ప్రొడక్షన్ వెంచర్‌ గా రూపొందిన ఈ చిత్రం ద్వారా శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పాన్-ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, బేబీ కియారా ఖన్నా కీలక పాత్రలో కనిపించనుంది.
మేకర్స్ ఈరోజు ఈ సినిమా ట్రైలర్‌కి సంబంధించిన అప్‌డేట్‌ని అందించారు. నవంబర్ 24న లాంచ్ చేయనున్నారు. ట్రైలర్ పోస్టర్ లో లీడ్ పెయిర్ – నాని, మృణాల్ ఠాకూర్ అద్భుతమైన కెమిస్ట్రీతో ఆకట్టుకున్నారు. టీజర్, పాటలు ప్రామిస్ చేసినట్లుగా హాయ్ నాన్న ఎమోషన్స్ తో కూడిన రోలర్‌కోస్టర్ రైడ్‌గా ఉండబోతోంది.మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ ఎత్తున నిర్మించిన ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలు చార్ట్ బస్టర్ హిట్స్ గా అలరిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *