-ప్రజల గురించి పరితపించే నాయకుడు పుట్ట మధన్నే
-ఇంటింటి ప్రచారంలో మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ
మంథని, (సిరా న్యూస్);
తొమ్మిదేండ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎమ్మెల్యేగా, జెడ్పీ చైర్మన్‌గా పుట్ట మధన్న ప్రతి గడపకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు, తన సేవలను అందించారని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ అన్నారు. ఎన్నికల ప్రచారంలో బాగంగా సోమవారం మంథని మున్సిపల్ పరిధిలోని పదో వార్డు పద్మశాలివీధిలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఆనాడు ఎమ్మెల్యేగా,జెడ్పీ చైర్మన్‌గా పుట్ట మధూకర్‌కు అవకాశం కల్పిస్తే మంథని అభివృధ్దికి ఎంతో కృషి చేశారని, ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ పథకాన్ని అందించారన్నారు.అంతేకాకుండా తన తల్లిపేరున స్థాపించినపుట్ట లింగమ్మ ట్రస్టు ద్వారా అనేక సేవలు అందించారన్నారు. మంథనికి చెందిన ఎంతో మందిపేదలకు సాయం అందించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఒక్కసారి ఎమ్మెల్యేగా ఆదరించిన మంథనిప్రజల గురించే నిత్యం పరితపిస్తారని,మంచి మనస్సున్న నాయకుడు పుట్ట మధూకర్ అని ఆమె కొనియాడారు. అయితే అనేక ఏండ్లుగా మనం ఓట్లు వేసి గెలిపించిన కాంగ్రెస్‌పాలకులు ఏనాడు మన కష్టాలు,కన్నీళ్లు పట్టించుకోలేదని ఆమె విమర్శించారు. మనలను ఓటు బ్యాంకుగా చూశారే తప్ప ఏనాడు ప్రజల అవసరాలకు అనుగుణంగా పరిపాలన అందించలేదన్నారు.గత ఎన్నికల్లో అబద్దాలు, అసత్యప్రచారాలు చేసి పుట్ట మధూకర్‌ను ప్రజలకు దూరంచేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచి ఐదేండ్లలో అభివృధ్ది చేయలేదని,ఏ ఒక్కరికి సాయం చేయలేదని ఆమె విమర్శించారు. ఇప్పటికే బీఆర్‌ఎస్ ప్రభుత్వం దేశం గర్వించే రీతిలో సంక్షేమపథకాలు అమలు చేస్తుందని, ఈసారి మళ్లీ అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ పథకాలకు రూపకల్పన చేశారని, అందులో ముఖ్యంగా కేసీఆర్ బీమా, సౌభాగ్యలక్ష్మి పథకాలు ప్రతి కుటుంబానికి భరోసా ఇస్తాయన్నారు.వాటితో పాటు పించన్‌లు,రైతుబంధు పెట్టుబడి సాయం పెంచనున్నట్లు ఆమె తెలిపారు. ప్రభుత్వ పథకాలతో పాటు పుట్ట మధూకర్ ఎమ్మెల్యేగా గెలిచిన వెంట ప్రభుత్వ పథకాలతో పాటు తన సొంతంగా ట్రస్టు ద్వారా మరిన్ని గొప్ప సేవలు అందిస్తారని ఆమె వివరించారు. మన భవిష్యత్‌తరాల కోసం ఆలోచన చేస్తున్న పుట్ట మధూకర్‌ను ఆదరించి ఆశీర్వదించాలని, ఈ మట్టి బిడ్డగా ఐదేండ్లు మీకు సేవకుడిలాపనిచేస్తాడని, కారు గుర్తుకు ఓటు వేసి బారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఆమె కోరారు.
========================